అమరావతి స్వేచ్ఛ: Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కన్ను తన సొంత నియోజకవర్గంపై పడింది. ఇటీవల ఏదొక రూపంలో పిఠాపురం వార్తల్లో నిలుస్తోంది. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ కు, స్థానిక జనసేన నాయకులకు విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించని పరిస్థితి. కానీ పిఠాపురం అభివృద్ధి పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపిస్తూ ముందుకు పోతున్నారని చెప్పవచ్చు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు.
ఇకపై వరుసగా సమీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి సేనాని వచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పేషి అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం పవన్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో రివ్యూలో పవన్ పలు కీలక సూచలు చేశారు. నియోజక వర్గ పరిధిలో 4 పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు.. అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల మూలంగా పోలీస్ శాఖ చులకన అవుతోందని దుయ్యబట్టారు. ఇకపై ప్రతివారం పిఠాపురం అభివృద్ధిపై సమీక్ష చేస్తానని తెలిపారు.
Also Read : TTD Update: టీటీడీ ట్రస్ట్‌లకు భారీ విరాళాలు.. అంతా కోట్లల్లోనే..
నేడు పెనుగొండకు పవన్
నేడు మొగల్తూరు, పెనుగొండ ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. గ్రామసభల్లో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. కాగా మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి కన్నుమూశారు. సత్యవతి మరణం గురించి తెలుసుకున్న పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ఆమె కన్ను మూశారని తెలిసి ఎంతో బాధ పడ్డాను. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని కోరుకుంటున్నాను’ అని ప్రకటనలో తెలిపారు. రమేష్, సత్యవతి కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా సమయం గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయని పవన్ గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లమని గుర్తు చేసుకుుని పవన్ ఎమోషనల్ అయ్యారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు