Trains Cancelled: ఆంధ్రప్రదేశ్ లో మెుంథా తుపాన్ ప్రభావం ప్రారంభమైంది. విశాఖ సహా పలు తీర ప్రాంత జిల్లాల్లో వర్షం మెుదలైంది. తీరం వెంబడి కొన్ని ప్రాంతాల్లో 60-70 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపై ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీచ్ వద్దకు పర్యాటకులను సైతం అనుమతించడం లేదు. మరోవైపు తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకొని విశాఖ మీదగా వెళ్లే 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే (East Coast Railway) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
రద్దు అయిన రైళ్లు ఇవే..
మెుంథా తుపాను కారణంగా అక్టోబర్ 27 – 29 తేదీల మధ్య ఒడిశా నుంచి ఆంధ్ర మీదుగా నడవాల్సిన 43 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారికంగా ప్రకటంచింది. వీటిలో విశాఖ నుంచి కిరండూల్, కాకినాడ, హైదరాబాద్, చెన్నై, ముంబయి వంటి ప్రధాన నగరాలకు వెళ్లే ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్, ఎంఈఎంయూ (Mainline Electric Multiple Unit) రైళ్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. కేటగిరి వారిగా రద్దు చేయబడిన రైళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
1. విశాఖపట్నం – కిరండూల్ రైళ్లు
* రైలు నెం. 18515 (విశాఖపట్నం – కిరండూల్ ఎక్స్‌ప్రెస్) – అక్టోబర్ 27
* రైలు నెం. 18516 (కిరండూల్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్) – అక్టోబర్ 28
* రైలు నెం. 58501, 58502 (ప్యాసింజర్ రైళ్లు) – అక్టోబర్ 28
* రైలు నెం. 58538, 58537 (విశాఖపట్నం – కోరాపుట్ ప్యాసింజర్) – అక్టోబర్ 28
* రైలు నెం. 18512 (విశాఖపట్నం – కోరాపుట్ ఎక్స్‌ప్రెస్) – అక్టోబర్ 27
* రైలు నెం. 18511 (కోరాపుట్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్) – అక్టోబర్ 28
2. ఎంఈఎంయూ (MEMU) సేవలు
* రైలు నెం. 67285, 67286 (రాజమండ్రి – విశాఖపట్నం) – అక్టోబర్ 28
* రైలు నెం. 67289, 67290 (విశాఖపట్నం – పలాస) – అక్టోబర్ 28
* రైలు నెం. 67287, 67288 (విశాఖపట్నం – విజయనగరం MEMU) – అక్టోబర్ 27, 28
* రైలు నెం. 68433, 68434 (కటక్ – గుణుపూర్) – అక్టోబర్ 28, 29
3. ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
* రైలు నెం. 17268, 17267 (విశాఖపట్నం – కాకినాడ ఎక్స్‌ప్రెస్) – అక్టోబర్ 28
* రైలు నెం. 08583, 08584 (విశాఖపట్నం – తిరుపతి ఎక్స్‌ప్రెస్) – అక్టోబర్ 27, 28
* రైలు నెం. 22875, 22876 (విశాఖపట్నం – గుంటూరు డబుల్ డెక్కర్) – అక్టోబర్ 28
* రైలు నెం. 22707 (విశాఖపట్నం – తిరుపతి డబుల్ డెక్కర్) – అక్టోబర్ 27
* రైలు నెం. 18526, 18525 (విశాఖపట్నం – బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్) – అక్టోబర్ 27, 28
* రైలు నెం. 17243, 17244 (గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్) – అక్టోబర్ 27
4. ప్యాసింజర్ రైళ్లు
* రైలు నెం. 58531, 58532 (బ్రహ్మపూర్ – విశాఖపట్నం) – అక్టోబర్ 28
* రైలు నెం. 58506, 58505 (విశాఖపట్నం – గుణుపూర్) – అక్టోబర్ 28
5. ముఖ్యమైన సూపర్‌ఫాస్ట్ & ఎక్స్‌ప్రెస్ రైళ్లు
* రైలు నెం. 17220 (విశాఖపట్నం – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్) – అక్టోబర్ 27
* రైలు నెం. 12727 (విశాఖపట్నం – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్) – అక్టోబర్ 27
* రైలు నెం. 12861 (విశాఖపట్నం – మహబూబ్‌నగర్ సూపర్‌ఫాస్ట్) – అక్టోబర్ 27
* రైలు నెం. 22869 (విశాఖపట్నం–చెన్నై సూపర్‌ఫాస్ట్ (వీక్లీ)) – అక్టోబర్ 27
Also Read: Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
విశాఖకు రిటర్న్ వచ్చే రైళ్లు..
* రైలు నెం. 12862 (మహబూబ్‌నగర్ – విశాఖపట్నం) – అక్టోబర్ 28
* రైలు నెం. 22870 (చెన్నై–విశాఖపట్నం) — అక్టోబర్ 28న రద్దు.
* రైలు నెం. 12739 (విశాఖపట్నం–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్) – అక్టోబర్ 27
* రైలు నెం. 20805 (విశాఖపట్నం – న్యూ ఢిల్లీ ఏపీ సూపర్‌ఫాస్ట్) – అక్టోబర్ 27
* రైలు నెం. 18519 (విశాఖపట్నం–లోక్‌మాన్య తిలక్) – అక్టోబర్ 27
* రైలు నెం. 20806 (న్యూ ఢిల్లీ – విశాఖపట్నం) అక్టోబర్ 29
* రైలు నెం. 18520 (లోక్‌మాన్య తిలక్ – విశాఖపట్నం) – అక్టోబర్ 29న రద్దు.
