TG CM in Vijayawada: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఏపీలోని విజయవాడలో పర్యటించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao) కుమారుడి వివాహనికి రేవంత్ హాజరయ్యారు. విజయవాడ నగర శివారు కంకిపాడులో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ శుభకార్యానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) హాజరయ్యారు. అలాగే సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (N.V. Ramana), పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Also Read: Money saving Tips: సమ్మర్ లో ఇలా చేస్తే.. డబ్బే డబ్బు.. టిప్స్ మీకోసమే!
అంతకుముందు స్పెషల్ హెలికాఫ్టర్ లో విజయవాడలో దిగిన సీఎంకు టీడీపీ నేతలు (TDP Cadre) ఘన స్వాగతం పలికారు. అప్పటికే పెళ్లి మండపం వద్దకు చేరుకున్న మంత్రి నారా లోకేష్ స్వయంగా సీఎంను లోపలికి ఆహ్వానించారు. సీఎం రేవంత్, నారా లోకేష్ ఇద్దరూ కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఆపై నవ దంపతుల వద్దకు వెళ్లారు. వారిని ఇరువురు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. నారా లోకేష్, సీఎం రేవంత్ ను ఒకే ఫ్రేమ్ లో చూసి టీడీపీ శ్రేణులు ఖుషీ అవుతున్నారు.