CM Chandrababu: అదొక చిన్న సెలూన్ షాప్. ఆ షాప్ ఓనర్ బత్తుల జగన్నాధం. ఏదో రోజువారీ కూలీ సంపాదించుకుంటున్నాడు. అక్కడికి ఓ పెద్దాయన వచ్చారు. ఆయనను చూసి బత్తుల జగన్నాధం షాక్. సార్.. మీరేంటి, నా వద్దకు రావడం ఏమిటి? నాకు మాటలు రావట్లేదు సార్.. ఇది కలనా? నిజమా? ఏంటి సార్, నాది చిన్న షాప్.. మీరెందుకు సార్.. అంటూ జగన్నాధం మాటలు. వచ్చిన పెద్దాయన మాత్రం, ఎంచక్కా, సెలూన్ లోని కుర్చీలో కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టారు.
జగన్నాధం ఎలా ఉంది జీవితం అంటూ ప్రశ్న? ఆ ప్రశ్నకు ఫరవాలేదు సార్, సాగిపోతుంది అంటూ సమాధానం. మీ పిల్లలు ఎంత మంది? అసలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద నీ అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వ పథకాలు ఫరవాలేదా? అసలు నువ్వేమనుకుంటున్నావు అంటూ పెద్దాయన ప్రశ్నలు. ఇక అంతే జగన్నాధం ఓపెన్ అయ్యారు. సార్, పింఛన్ పెంచారు. గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారు. మా నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన మాట ప్రకారం ఆలయాలలో స్థానం కల్పించారు. వేతనాలు పెంచారు. మాకు కరెంట్ కూడా సబ్సిడీ ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు.
ఓకే రోజూ పని ఉంటుందా అంటూ ఆ పెద్దాయన ప్రశ్న. ఔను సార్.. ఉంటుంది అంటూ జగన్నాధం ఆన్సర్. జగన్నాథం ఓకే గానీ అక్కడికి వెళ్లిన పెద్దాయన ఎవరనే కదా? ఆయనే ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో పర్యటించిన సీఎం చంద్రబాబు నేరుగా, చిన్న సెలూన్ దుకాణం నిర్వహిస్తున్న జగన్నాధం వద్దకు నేరుగా వెళ్లారు. అక్కడికి వెళ్ళడం అటుంచితే, అక్కడికి వెళ్ళిన సీఎం చంద్రబాబు అక్కడి సీట్లో కూర్చొని మాట్లాడడంతో జగన్నాధం కాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Also Read: Indian Railways on Tatkal booking: అదంతా ఫేక్.. ఆ వార్తలు నమ్మొద్దన్న ఇండియన్ రైల్వే..
సీఎం చంద్రబాబు మాట్లాడి వెళ్లిన అనంతరం జగన్నాథం వద్దకు ప్రజలు పరుగులు పెట్టారు. అసలు సీఎం చంద్రబాబు ఏం చెప్పారు? ఏం మాట్లాడారంటూ ఆరా తీయడం కనిపించింది. మొత్తం మీద పాలన పరంగా సీఎం చంద్రబాబు మార్క్ ఎలా ఉంటుందో, ఇటీవల ఏ గ్రామ పర్యటనకు వెళ్ళినా చంద్రబాబు మాత్రం సామాన్యమైన వ్యక్తిలా అక్కడి ప్రజలతో మమేకం అవుతుండగా, తెలుగు తమ్ముళ్లు తెగ సంబర పడుతున్నారట.
Hon'ble CM Shri @ncbn Garu had a meaningful interaction with Bathula Jagannadham Garu, a humble barber, in Agiripalli today. The conversation spanned perspectives on several aspects of his life and aspirations.#AndhraPradesh pic.twitter.com/O2lVFlQH6W
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 11, 2025