CM Chandrababu: తెలుగు దేశం పార్టీని భూ స్థాపితం చేయాలని చూసిన అందరూ నేడు కాల గర్భంలో కలిసి పోయారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం వద్ద పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద శనివారం పార్టీ నేతలు, కార్యకర్తల సందడి నెలకొన్నది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీ ఏర్పాటు చేసిన 9నెలల్లోనే అధికారాన్ని దక్కించుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ నాటి నుంచి నేటికీ ప్రజాధారణ పొందుతూ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నదన్నారు. ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి మళ్లీ పుట్టరని, ఆయన అడుగు జాడల్లో నడుస్తూ.. పార్టీని నడిపిస్తున్నామన్నారు. ఎన్నో పార్టీలు వెలిశాయి, కనుమరుగయ్యాయి. కానీ తెలుగుదేశం పార్టీ 43 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందుతూ మరింత భలోపేతం అయ్యిందన్నారు.
Also Read: చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్.. తెగ వైరల్ చేస్తున్న క్యాడర్..
పార్టీ రథసారథులు కేవలం కార్యకర్తలే నని, వారే పార్టీకి శ్రీరామరక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగు దేశం పార్టీ ఉంటుందని, మనం వారసులమే కానీ పెత్తందారులం కాదన్నారు. పార్టీ కోసం కష్ట పడకుండా.. పదవులు కావాలని తనను అభ్యర్థిస్తే కుదురదని క్షేత్ర స్థాయిలో పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని చంద్రబాబు చెప్పరు. పల్నాడు జిల్లాలో పీకమీద కత్తి పెట్టినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పలకని కార్యకర్తలు మనందరికీ ఆదర్శం అన్నారు. పదవుల కోసం ఎవరూ సీఫార్స చేసినా పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని ఈ మాటలు ప్రతి టీడీపీ కార్యకర్త గుర్తించుకోవాలన్నారు.