CM Chandrababu (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

CM Chandrababu: ఈ ఆనందం మాట్లలో చెప్పలేను.. నా సంకల్పం నిజమైంది.. చంద్రబాబు ఎమోషనల్

CM Chandrababu: చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటన ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా మారింది. పరమసముద్రం చెరువు వద్దకు వెళ్లిన చంద్రబాబు అక్కడ కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు. హంద్రీనీవా కాలువల ద్వారా కుప్పంకు తొలిసారి కృష్ణమ్మ నీళ్లు రావడం ఒక అపూర్వ ఘట్టంగా చంద్రబాబు అభివర్ణించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఇక్కడి ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తి కలుగుతోందని అన్నారు.

‘738 కిలో మీటర్ల కృష్ణమ్మ రాక’
కుప్పం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘నా జీవితంలో ఇది పవిత్రమైన రోజు. మీ ఇంటి బిడ్డగా కుప్పం ప్రజలు నన్ను ఆదరించారు. కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను. నా ఆనందం మాటల్లో చెప్పలేను. నా సంకల్పం నిజమైంది. 738 కిలో మీటర్ల నుంచి కుప్పం పరమసముద్రానికి కృష్ణా జలాలు తెచ్చాం. ఏడు వందల మీటర్లు ఎత్తుకు నీళ్లు తెచ్చాం. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల నిర్మాణంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి మారింది. అందుకే శతాబ్దాలు గడిచినా కాటన్ దొరను గోదావరి ప్రజలు ఇంకా మరువలేదు. అలాగే రాయలసీమకు నీళ్లు తెచ్చేందుకు సంకల్పం తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్. పశువులను కాపాడుకోవడానికి రైళ్లల్లో నీళ్లు తెప్పించాల్సిన దారుణమైన కరవు రాయలసీమలో ఉండేది. అప్పుడే చాలా బాధపడ్డాను. ఈ పరిస్థితి మార్చాలనుకున్నా. 1999లో హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశా’ అని చంద్రబాబు అన్నారు.

అబద్దాల చెప్పడంలో వైసీపీ దిట్ట
శ్రీశైలం మల్లన్న దగ్గరున్న జలాలను కుప్పం మల్లన్న వద్దకు చేర్చాం. గంగమ్మ ఆశీర్వదించింది.. కుప్పానికి కృష్ణమ్మ వచ్చింది. కుప్పం ప్రజల ఆనందంలో పాలుపంచుకునేందుకు సెక్యూర్టీని కూడా పక్కన పెట్టి పరమసముద్రం చెరువులో బోటులో పర్యటించాను. రాయలసీమను రాళ్ల సీమ కానివ్వను.. రతనాల సీమ చేస్తాను. 2014-19 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టాం. 2019-24 మధ్య కాలంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ. 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. గతం ఓసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సెట్టింగులు వేశారు.. గేట్లు తెచ్చారు.. నీళ్లు కూడా బయట నుంచే తెచ్చి.. విడుదల చేసినట్టు మభ్య పెట్టారు. విమానం ఎక్కేలోగానే నాడు విడుదల చేసిన నీరు ఆవిరైపోయింది. అబద్దాల చెప్పడంలో వైసీపీ దిట్ట. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఎన్డీఏ వల్లే సాధ్యం. ఇప్పుడు కుప్పానికి నీళ్లు రాగానే జీర్ణించుకోలేకపోతున్నారు. బయట నుంచి నీళ్లు తెచ్చి మభ్యపెట్టడం వైసీపీకి అలవాటు. చెరువులను నీళ్లతో నింపడం మాకు అలవాటు’ అని చంద్రబాబు అన్నారు.

Also Read: Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ అనూహ్య నిర్ణయం.. దీనికి కారణం ఏమిటి?

తెలంగాణ నేతలకు సూచన
45 ఏళ్ల రాజకీయ జీవితంలో నిరంతరం నీటి నిర్వహణపై దృష్టి పెట్టానని కుప్పం సభలో చంద్రబాబు అన్నారు. ‘నీరు-మీరు, నీరు-చెట్టు, చెక్ డ్యాములు, సాగు నీటి సంఘాలు, వాటర్ షెడ్లు అంటూ నీటి నిర్వహణ కోసం ప్రయత్నించాను. పరుగెత్తే నీటిని నడిపించాలి.. నడిచే నీటిని నిలపాలనే సూత్రంతో పని చేశాను. పాలేరును అభివృద్ధి చేస్తాం. కుప్పం సహా సీమలోని ప్రతి చెరువునూ నింపుతాం. చెరువులను నింపితే… వర్షాభావ పరిస్థితులు వచ్చినా.. తట్టుకోగలం. కుప్పానికి నీరు చేరడంతో రైతుల్లో ఆనందం వచ్చింది. కష్టాలు తీరతాయని రైతులు చెబుతున్నారు. రైతుల ఆనందం కోసమే నేను పనిచేస్తున్నాను. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు మళ్లీ డయాఫ్రం వాల్ నిర్మాణం కొత్తగా చేపట్టాం. పోలవరం పూర్తి అయితే కొంత వెసులుబాటు వస్తుంది. పోలవరం-బనకచర్ల ద్వారా వంశధార-పెన్నా అనుసంధానం చేయగలిగితే ఏపీకి శాశ్వతంగా కరవు అనేదే ఉండదు. తెలంగాణ ప్రజలు కూడా నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించాలి. నీటి సమస్య అనేది తెలుగుజాతికి లేకుండా ఉండాలనే దిశగా తెలంగాణ నాయకులు కూడా ఆలోచించాలి. నీళ్లు ఉన్నప్పుడు నీటి విలువ తెలియదు.. నీరు లేనప్పుడు ఆ విలువ తెలుస్తుంది. అందుకనే నీటి నిర్వహణ సమర్ధవంతంగా చేపట్టాలి. భూమినే జలాశయంగా మార్చుకోవాలి’ అని చంద్రబాబు అన్నారు.

Also Read: Youtuber Arrested: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి ఏమో.. అడ్డంగా బుక్కైన యూట్యూబర్

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం