Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌పై, ఆ దేశంలో ఆశ్రయం పొందుతున్న ఉగ్రమూకలపై భారత త్రివిధ దళాలు బుధవారం తెల్లవారుజామున జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. అర్ధరాత్రి కేవలం 25 నిమిషాల్లోనే భారత త్రివిధ దళాలు పనిపూర్తి చేసేశాయి. ముందుగా టార్గెట్ ఫిక్స్ చేసుకున్న 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు ఒక్కసారిగా భారత్ దళాలు మెరుపుదాడికి దిగాయి. ఈ దాడుల్లో 70 మంది ఉగ్రవాదులు హతమవ్వగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తున్నది. ఆపరేషన్ సింధూర్‌పై తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా, మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఎవరెవరు ఎలా రియాక్ట్ అయ్యారనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
Read Also- Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో.. సీఎం అత్యవసర సమీక్ష!
సీఎం చంద్రబాబు : పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా జరిగిన ఆపరేషన్ సింధూర్ మన దేశ శక్తి సామర్థ్యాలను, మన సైన్యం పరాక్రమాన్ని ప్రపంచానికి చాటింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు భారత సైన్యానికి మద్దతుగా దేశం మొత్తం అండగా నిలుస్తుంది. దేశ భద్రతను కాపాడటంలో ప్రధాని నాయకత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం.
పవన్ కళ్యాణ్ : చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగాలి. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పింది. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధాని నరేంద్ర మోదీకి యావత్ జాతి మద్దతిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలి. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దు. భారత సైన్యాన్ని కించపరచినా.. దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులుపెడితే కఠిన చర్యలు తప్పవు. కాంగ్రెస్‌లో కొందరు నాయకులు తమ వైఖరిని మార్చుకుంటే మంచిది. రక్షణ దళాలు దీటుగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయి. మోదీ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటాం. పాకిస్థాన్‌కు మద్దతుగా ఆలోచించే నాయకులు వైఖరి మార్చుకోవాలి.
Read Also- Operation Sindoor: సహనం.. సహనం ఎంతకాలం? మహా సేనా మీ వెన్నంటే మేము!
వైఎస్ జగన్ : పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్. భారత్‌లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. కశ్మీర్‌లోని పహల్గావ్‌లో ఉన్న బైసరన్ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడి. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్ సింధూర్ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్‌దేశం అండగా నిలుస్తుంది. దేశ పౌరుల భద్రత ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది.
Read Also- Operation Sindoor: పాక్ తో యుద్ధ ముప్పు.. సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు!
సీపీఐ నారాయణ: పాక్‌పై యుద్ధానికి సీపీఐ వ్యతిరేకం. ఉగ్రవాదులను హతమార్చడానికే భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది. పాక్‌పై యుద్ధం చేయడానికి కానే కాదు. ఉగ్రవాదులను చంపడం న్యాయమే.. పాకిస్థాన్ కూడా ఉగ్రవాదుల నిర్మూలనలో భారత దేశానికి సహకరించాలి. పోరు ఉగ్రవాదంపై ఉండాలి.. పాక్ పౌరులు, ప్రభుత్వంపై కాదు. అలా చేస్తే ఉగ్రవాదం బలోపేతం అవుతుంది.
మధుసూధన్ రావు తల్లి (పద్మావతి) : నా కొడుపు కోత మరెవరీ రాకూడదు. ఉగ్రవాదులు ఒక్కరూ కూడా ఉండకూడదు. అదీ కూడా భారత్‌నే చేయాలి. ఇక నుంచి ఉగ్రవాదుల చేతుల్లో ఎవరి ప్రాణాలు పోగోకూడదు. ఎన్ని యుద్ధాలు చేసినా నా కుమారుడిని తిరిగి తీసుకురాలేరు. మా కుటుంబానికి ఉగ్రవాదులు తీరని ద్రోహం చేశారు. ఉగ్రవాదులు మరెవరినీ చంపకుండా భారత్ గట్టిగా బుద్ధి చెప్పాలి. అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు హతం కావాల్సిందే. (కాగా పహల్గాం ఉగ్రదాడిలో నెల్లూరుకు చెందిన మధుసూదన్‌రావు మృతిచెందారు)