Chandrababu Tongue Slip: రాజకీయ నాయకులు ఉదయం లేచింది మొదలుకొని.. రాత్రి నిద్రపోయేంత వరకు ఏదో ఒక అంశంపై మాట్లాడుతూనే ఉంటారు. ఎన్నో సభలు, సమావేశాలు, ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు, ప్రజలతో మమేకం.. ఇలా ప్రతిచోటా పొలిటీషియన్లు నోటికి పనిచెప్పాల్సి ఉంటుంది. ఎంత అలసటగా అనిపించినా, ఎక్కడా ఏకాగ్రత కోల్పోకుండా, ఏమాత్రం తడబాటుకు గురికాకుండా మాట్లాడుతుంటారు. ఈ రీతిలో ధారాళంగా మాట్లాడే తెలుగు రాజకీయ నాయకుల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందువరుసలో ఉంటారు. కొన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన పొరపాటున తప్పుగా మాట్లాడిన సందర్భాలు చాలా అరుదు. అయితే, తాజాగా ‘చంద్రబాబు టంగ్ స్లిప్’ (Chandrababu Tongue Slip) అయ్యారు. ఏపీకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన ఆయన, ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్త తడబాటుకు గురయ్యారు.
చంద్రబాబు పొరపాటు.. వైసీపీ ట్రోలింగ్
రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అయితే, ఇంటర్వ్యూ మధ్యలో ‘‘ఈ 18 నెలలో రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 23 లక్షల కోట్ల ఉద్యోగాలు సృష్టించబోతున్నాం’’ అని చంద్రబాబు పొరపాటున అన్నారు. ‘ఏంటీ.. 23 లక్షల కోట్ల ఉద్యోగాలా?’ అని ఇంటర్వ్యూ హోస్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ.. చంద్రబాబు పసిగట్టలేదు. దీంతో, కరెక్షన్ కూడా చేసుకోలేదు. ఇంకేముంది, దొరికిందే సందు అన్నట్టుగా వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు ట్రోలింగ్‌కు దిగాయి.
వైసీపీ వ్యంగ్యాస్త్రాలు..
చంద్రబాబు టంగ్ స్లిప్‌పై వైసీపీ శ్రేణులు జోకులు పేల్చుతున్నాయి. ‘‘ఈ ప్రపంచంలో ఉన్న ఆడ, మగ, చిన్నాపెద్ద, ముసలి ముతక అందరికీ నువ్వే జాబులు ఇచ్చినా 800 కోట్లు దాటవు కదా!. అలాంటిది 23 లక్షల కోట్ల జాబ్స్ ఎలా… హవ్!. సినిమాల్లో గ్రాఫిక్స్ చూశాం. కానీ రాజకీయాల్లో గణితంతో గ్రాఫిక్స్ చేయడం ఒక్క చంద్రన్నకే సాధ్యం!’’ అంటూ వైసీపీ మద్దతుదారు ఒకరు వీడియో షేర్ చేశారు. ఇచ్చేది సూదంత.. గొప్పలు మాత్రం కొండంత అని కామెంట్లు చేస్తున్నారు. ఈ భూమిపై ఉన్న ప్రాణులు అన్నింటికీ జాబ్స్ ఇచ్చారేమో అంటూ ఫన్నీ కామెంట్లు పెట్టారు.
చంద్రబాబు ఉద్దేశం అది కాదు..
సదరులో ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి టంగ్ స్లిప్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నామని ఆయన చెప్పదలచుకున్నట్టుగా వీడియో ద్వారా స్పష్టమైంది. అయితే, పెట్టుబడుల సంఖ్యను వివరించేందుకు వాడిన లక్షల కోట్ల పదాన్ని ఉద్యోగాల సంఖ్యను చెప్పేటప్పుడు కూడా పొరపాటున జోడించారు. ఆ మాట ఫ్లోలో వచ్చేసినట్టుగా స్పష్టమవుతోంది. అయితే, సోషల్ మీడియా వచ్చాక ప్రతి చిన్న విషయం కూడా టార్గెట్ అవుతున్న నేపథ్యంలో, ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా చంద్రబాబుపై వైసీపీ సోషల్ మీడియా పేజీలు జోకులు పేల్చుతున్నాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా పోకడ అలా ఉంది మరి!.
Read Also- Sasirekha Video Song: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి ‘ఓ శశిరేఖా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. చూసేయండి మరి
ఆంధ్రప్రదేశ్ జనాభా – 8 కోట్లు
భారతదేశం జనాభా – 150 కోట్లు
మొత్తం ప్రపంచ జనాభా – 800 కోట్లుకానీ.. తాను మాత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల కోట్ల ఉద్యోగాలు సృష్టించానని చెప్తున్న సీఎం చంద్రబాబు
Courtesy: NDTV pic.twitter.com/vH7jtZ79J3
— PulseNewsBreaking (@pulsenewsbreak) January 22, 2026

