BJP Rajya sabha Candidate: ఏపీలో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బీజేపీ (BJP) తన అభ్యర్థిని ఖరారు చేసింది. తమ పార్టీ అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ (Paka Venkata Sathyanarayana)ను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో వెంకట సత్యనారాయణ పోటీ చేయనున్నారు.
బీజేపీ ఏపీ కోర్ సమావేశంలో వెంకట సత్యనారాయణ పేరును తమ పార్టీ నేతలు ఖరారు చేసినట్లు బీజేపీ తాజా ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం యూపర్ పర్యటనలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అక్కడి నుంచే వర్చువల్ గా ఈ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన పాకా వెంకట సత్యనారాయణ వైపే అధిష్టానం మెుగ్గుచూపింది.
రాష్ట్ర రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బిజెపి సీనియర్ నాయకులు, పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ పాక వెంకట సత్యనారాయణ గారిని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. pic.twitter.com/jnGzg2KhEQ
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 28, 2025
Also Read: Google In AP: విశాఖలో గూగుల్.. జాబ్స్ వేలల్లో.. మీరు సిద్ధమా!
పాకా వెంకట సత్యనారాయణ.. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. గతంలో భీమవరం కౌన్సిలర్ గా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆయన పనిచేశారు. అయితే ఈ రాజ్యసభ స్థానం కోసం పలువురు పేర్లు తొలుత వినిపించాయి. చిరంజీవి లేదా నాగబాబుకు జనసేన తరపున సీటు ఇస్తారంటూ గతంలో ప్రచారం జరుగుతుంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకు అవకాశం దక్కవచ్చని ప్రచారం జరిగింది.