AP Dwcra Loans (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

AP Dwcra Loans: ఏపీలో ఇదేం స్కీమ్.. అడిగినంత డబ్బులు తీసుకోవడమే.. సూపర్ కదా!

AP Dwcra Loans: ఏపీలోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా దూసుకుపోతోంది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పనులు, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ సంక్షేమం విషయంలో సీఎం చంద్రబాబు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. ఎన్నికల హామీలను ఒక్కొటిగా నెరవేరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల సంక్షేమానికి తన ప్రభుత్వ పెద్ద పీట వేస్తున్నట్లు పదే పదే చెబుతూ వస్తున్న సీఎం.. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

మహిళలకు అడిగినంత అప్పు
ఏపీలోని సాధారణ, మధ్యతరగతి మహిళలు.. చాలా వరకూ డ్వాక్రా స్కీముల్లో సభ్యులుగా కొనసాగుతుంటారు. మహిళలు గ్రూపులుగా ఏర్పడి బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని.. దానిని దశల వారీగా చెల్లిస్తుంటారు. అయితే డ్వాక్రా మహిళలకు రుణాలు అందించడంలో బ్యాంకులు కొన్ని పరిమితులు విధిస్తుంటాయి. అయితే అలాంటివేమి లేకుండా అడిగినంత అప్పు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతోంది.

రూ.61,964 కోట్ల రుణం
స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక సాయం చేసేలా ఎన్డీయే ప్రభుత్వం కొత్త రుణ ప్రణాళికను రూపొందించింది. 2026 మార్చి నాటికి 88,48,109 మంది సభ్యులకు రూ.61,964 కోట్లను రుణంగా అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది సభ్యులను ఎన్యుమరేటర్లుగా ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు.

కోరుకున్న రంగంలో శిక్షణ
ప్రభుత్వ తాజా రుణ ప్రణాళిక ప్రకారం అత్యధికంగా వ్యవసాయ రంగంలో రుణాలు అందించనుంది. ఏకంగా రూ.11,319 కోట్లను స్వయం సహాయక బృందాల సభ్యులకు కేటాయించనుంది. అంతేకాదు కోరుకున్న రంగంలో మహిళలు రాణించేందుకు వీలుగా వారికి ప్రత్యేక శిక్షణ సైతం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా మహిళలు తమ సొంత కాళ్లమీద నిలబడి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Also Read: HC on Group 1: గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హైకోర్ట్ కు టీజీపీఎస్సీ.. రేపే విచారణ!

సొంతింటి కల నెరవేరేలా
మరోవైపు పేదల సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 870 పాత లేఅవుట్లకు అనుమతులను పునరుద్దరించింది. ఈ లేఅవుట్లలో సుమారు 85,000 ప్లాట్లు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా నిర్ణయంతో ఆయా ప్లాట్లకు బ్యాంక్ రుణాలు సులభంగా దొరుకుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read This: Mahesh Kumar on KCR: కేసీఆర్.. దమ్ముందా? ఛాలెంజ్ అంటూ టీపీసీసీ చీఫ్ సవాల్!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు