AP WhatsApp Governance (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

AP WhatsApp Governance: ఇంటింటికీ రానున్న అధికారులు.. సర్వే కోసం కాదు.. మరెందుకంటే?

AP WhatsApp Governance: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాటిలో వాట్సప్ గవర్నెన్స్ (WhatsApp Governance) అతి కీలకమైనది. ఆన్ లైన్ లో ప్రభుత్వ సేవలను అందించే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈ విధానాన్ని శ్రీకారం చుట్టారు. దీని ‘మన మిత్ర’ (Mana Mithra) అనే పేరుతో ప్రస్తుతం ఈ వాట్సప్ సేవలు (WhatsApp Services) ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తొలిదశలో 161 రకాల పౌరసేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ గవర్నెన్స్ సేవలను ప్రస్తుతం ఏపీ ప్రజలు (Andhra People) వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మన మిత్రకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంటింటికీ మన మిత్ర
వాట్నప్ గవర్నెర్స్ ను చాలా మంది వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డిజిటల్ సేవలను (Digital Services) మరింత మందికి చేరవేయాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి ‘ఇంటింటికీ మన మిత్ర’ (Intitiki Mana Mithra) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ తిరగనున్నారు.

ఆ నెంబర్ తప్పనిసరి
వాట్సప్ గవర్నెన్స్ కోసం ప్రభుత్వం 95523 00009 నెంబర్‌ (WhatsApp Governance Number) ను గతంలోనే తీసుకొచ్చింది. ఇంటింటికీ మన మిత్ర కార్యక్రమంలో భాగంగా.. ఈ నెంబర్ ను ప్రతీ ఒక్కరి మెుబైల్ లో అధికారులు సేవ్ చేయనున్నారు. మన మిత్ర పేరిట ప్రజల ఫోన్లలో భద్రపరచనున్నారు. అంతేకాదు.. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఎలాంటి సేవలు పొందవచ్చు? ఎలాంటి ధ్రువపత్రాలను అందుకోవచ్చు? వంటి విషయాలను ప్రజలకు తెలియజేయనున్నారు.

Also Read: Bhupalpally: ‘ది గోట్ లైఫ్’ మూవీ రిపీట్.. ఉద్యోగమని వెళ్లి నరకం చూస్తున్న తెలుగు యువకులు!

1000 రకాల సేవలు టార్గెట్
వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించిన తొలినాళ్లలో 161 రకాల ప్రభుత్వ సేవలను మంత్రి నారా లోకేష్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వాటి సంఖ్యను 250కి పైగా పెంచారు. ఈ ఏడాది జూన్ నాటికి 500 సేవలు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆ తర్వాత 1000 రకాల సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది.

Also Read This: Theft At KIA Unit AP: కియా పరిశ్రమలో దొంగల చేతివాటం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు.. ఏమైందంటే?

ఎలా వర్క్ చేస్తుందంటే?
ప్రజలు.. ఈ వాట్సప్ గవర్నెన్స్ వినియోగించుకోవాలని భావిస్తే ముందుగా 95523 00009కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే వెంటనే ఆ నెంబర్ నుంచి వాట్సప్ కు ఓ లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నెంబర్, ఇంటి చిరునామా తదితర వివరాలు నమోదు చేయాలి. దానిని సెండ్ చేయగానే ఓ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని సాయంతో మీరు పెట్టిన వినతి స్టేటస్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా దేవాదయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ (APSRTC), రెవెన్యూ (Revenue Deparment), మున్సిపల్ తదితర శాఖల సేవలను పొందవచ్చు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు