Bhupalpally: 'ది గోట్ లైఫ్' మూవీ తరహాలో ఇద్దరు యువకుల నరకం!
Bhupalapalli (Image Source: AI)
Telangana News

Bhupalpally: ‘ది గోట్ లైఫ్’ మూవీ రిపీట్.. ఉద్యోగమని వెళ్లి నరకం చూస్తున్న తెలుగు యువకులు!

Bhupalpally: మయన్మార్ ఆర్మీ (Myanmar Army) చేతిలో బందీలుగా భూపాలపల్లి (Bhupalpally) వాసులు చిక్కారు. ఏజెంట్ల మాటలు నమ్మి ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లిన ఇద్దరు యువకులు దారుణంగా మోసపోయారు. సరైన పత్రాలు లేకపోవడంతో అక్కడి అర్మీ వారిని అదుపులోకి తీసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని…
భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలానికి చెందిన అజ్మీరా సంతోష్ (Ajmeera Santhosh), లావుడ్య విజయ్ (Lavudya Vijay) అనే ఇద్దరు యువకులు.. బతుకుతెరువు కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఏజెంట్లను కలవగా వారు.. ఆ ఇద్దరు యువకులకి మాయమాటలు చెప్పారు. బ్యాంకాక్, థాయిలాండ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారిలో ఆశలు కల్పించారు.

పాస్ పోర్టులు స్వాధీనం
ఏజెంట్లు మాటలు నమ్మిన ఇద్దరు యువకులు సంతోష్, విజయ్.. ఇక తమ జీవితం బాగుపడుతుందని భావించారు. మంచిగా విదేశాల్లో సెటిల్ అవ్వొచ్చని కలలు కన్నారు. అయితే వారి ఆశలను ఏజెంట్లు అడియాశలు చేశారు. బ్యాంకాక్, థాయిలాండ్ తీసుకెళ్తామని చెప్పిన ఏజెంట్లు.. ఆ ఇద్దరు యువకుల పాస్ పోర్ట్లు, సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకొని మయన్మార్ కు పంపారు. అక్కడ రెండు నెలల పాటు కూలీ పనులు అప్పజెప్పారు.

ఏజెంటు పరారీ
అయితే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి.. ఇలా కూలీ పనులు చేయించడంపై ఏజెంట్ ను ఇద్దరు యుకులు ప్రశ్నించాడు. దీంతో అతడు పరారయ్యాడు. అయితే సరైన పత్రాలు లేకపోవడంతో విజయ్, సంతోష్ ను మయన్మార్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. దీంతో యువకుల కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. తమ పిల్లలను తిరిగి వెనక్కి రప్పించాలని కేంద్రం మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), శ్రీధర్ బాబు (Sridhar Babu) లను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం (Telangana Govt) తమ పిల్లలను వెనక్కి తీసుకురావాలని వేడుకున్నారు.

Also Read: Theft At KIA Unit AP: కియా పరిశ్రమలో దొంగల చేతివాటం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు.. ఏమైందంటే?

ది గోట్ లైఫ్ సినిమా ఏంటంటే?
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా.. బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే ‘ది గోట్ లైఫ్’ (The Goat Life). 2024 మార్చిలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో హీరో కూడా ఉద్యోగం కోసమని సౌదీ వెళ్తాడు. ఏజెంట్ మోసం చేయడంతో అక్కడి కఫీల్ చేతిలో ఇరుక్కుంటాడు. దీంతో గొర్రెల కాపరీగా మారతాడు. చుట్టూ కనుచూపు మేర ఎడారి ఉండటంతో తప్పించుకునేందుకు అనేక కష్టాల పడతాడు. ప్రస్తుతం భూపాలపల్లి యువకుల స్టోరీ కూడా ఇంచుమించు అదే విధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read This: Pawan Kalyan Son Injured: పవన్‌ కుమారుడి ఆరోగ్యంపై కీలక అప్ డేట్.. స్వయంగా పంచుకున్న చిరు!

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య