Vijayawada Metro(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Vijayawada Metro: విజయవాడలో మెట్రో పరుగులు.. మరికొన్ని నెలల్లోనే..

Vijayawada Metro: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు దిశగా మరో కీలక ముందడుగు పడింది. భూసేకరణకు అవసరమైన చర్యలు  మొదలయ్యాయి. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో భూసేకరణ చర్యలు అధికారులు ఆరంభించారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు చీఫ్ మేనేజర్ జీపీ రంగారావు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, రెవెన్యూ అధికారులు కలిసి గన్నవరం, కేసరపల్లిలో భూములను పరిశీలించారు.

నగరంలోని బస్టాండ్, హెచ్‌సీఎల్, కేసరపల్లి కూడలిలో 12:42 మీటర్లతో నిర్మించనున్న మెట్రో స్టేషన్లకు కావాల్సిన భూమిపై అధికారులు చర్చించారు. త్వరలోనే భూసేకరణ పనులను అధికారులు మరింత ముమ్మరం చేయనున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంపై అధికారులు దృష్టిసారించారు.

Also read: RRB Jobs 2025: రైల్వే జాబ్స్ పై బిగ్ అప్డేట్.. 9,970 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇప్పటికే ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ నేతృత్వంలోని రెండు జిల్లాల కలెక్టర్లతో ప్రతి పదిహేను దినాలకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరగా మెట్రో నిర్మాణ పనులను మొదలు పెట్టే దిశగా అడుగులు వేస్తు్న్నారు. రామవరప్పాడు చౌరస్తా నుంచి గన్నవరం వరకు జాతీయ రహదారి మీదుగా మెట్రో లైన్‌ నిర్మించనున్నారు.

తొలిదశలో నిర్మించనున్న మెట్రో లైన్‌కు 82.66 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంది. ఇందులో రైల్వే, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన భూమి 1.03 ఎకరాలు ఉంది. మరో 4.86 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వద్ద ఉండగా, మిగతా 76.77 ఎకరాలు ప్రైవేటు భూమిగా గుర్తించారు. దీంతో, ఈ భూసేకరణకు రూ.1,152 కోట్ల మొత్తం అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి  https://epaper.swetchadaily.com/

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ