Daggubati Purandeswari [image credit: twitter]
ఆంధ్రప్రదేశ్

Daggubati Purandeswari: పురంధేశ్వరికి కీలక పదవి? ఎవరికి చెక్ పెడతారో?

Daggubati Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి రాజమండ్రి ఎంపీ పురందేశ్వరిని(Daggubati Purandeswari)మార్చితే ఆమె కీలక పోస్టు దక్కవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒక రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను మార్చితే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవీ, లేదా, బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని అధిరోహించే అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

పురందేశ్వరికి ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో పరిపూర్ణమైన ప్రావీణ్యం ఉండడంతో అవకాశాలు మెండుగా ఉన్నాయని, తద్వారా దక్షిణాదికి డిప్యూటీ స్పీకర్ పదవి లభించడంతో పాటు మహిళా ప్రాతినిథ్యానికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.

CS Shanti Kumari: శాంతికుమారికి షాక్ తప్పదా? కొత్త సీఎస్ పోస్టు ఎవరిది?

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దక్షిణాదిలో పురందేశ్వరి కంటే అర్హులు మరొకరు లేరని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) కూడా సుముఖంగా ఉన్నట్లు ఢిల్లీ సర్కిల్స్‌లో పట్టువున్న నాయకులు చెబుతున్నారు.బీజేపీ ఉత్తరాది పార్టీ అనే విమర్శలకు చెక్ పెట్టేందుకు జేపీ నడ్డా స్థానంలో పురందేశ్వరిని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు పీఠంపై కూర్చోబెట్టే అవకాసం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Also Read: Ontimitta Temple: నేడే సీతారాముల కళ్యాణం.. అందరూ ఆహ్వానితులే..

గతంలో పురందేశ్వరి జాతీయస్థాయి పదవిని చేపట్టిన అనుభవం ఉంది. జాతీయ మహిళామోర్చా అధ్యకురాలిగా ఆమె బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. అందుకే, పురందేశ్వరికి కేంద్రంలో మంత్రి పదవి లభించకపోయినా, దానికి సమానంగా పార్టీలో కీలక పదవి లభిస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు ఉండడం పదవి దక్కడం ఖాయమనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

పోలీసు వ్యవస్థకి జగన్‌ సారీ చెప్పాలి
నాలుగో సింహంగా పరిగిణించే పోలీస్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు జగన్ మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) క్షమాపణ చెప్పాలని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. పోలీసుల పట్ల జగన్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థకు జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని ఆమె అన్నారు.

ఏ రాజకీయ నాయకుల ప్రమేయంతోనే, ఏదో ఒక వ్యవస్థ చొరవతోనో పోలీసు ఉద్యోగం రాదని, ఎంతో శ్రమించి కష్టతరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే పోలీసు ఉద్యోగం వస్తుందని ఈ సందర్భంగా పురందేశ్వరి (Daggubati Purandeswari)పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను పోలీసుల భుజాన ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ నాలుగవ సింహంగా గుర్తిస్తుంటారని ఆమె కొనియాడారు.

 Also Read: Janasena on Kavitha: పవన్ తో పెట్టుకున్న కవిత.. ఏకిపారేస్తున్న జనసైనికులు.. మరీ ఇంత ఘోరంగానా!

ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా శాంతి భద్రతలను పరిరక్షించడంతో పోలీసులు కీలకపాత్ర పోషిస్తుంటారని మెచ్చుకున్నారు. సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అని కూడా చూడకుండా, వైఎస్ జగన్ విచక్షణ కోల్పోయి మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 వేల మంది మహిళా పోలీసులు ఉన్నారనే విషయమైనా జగన్‌కు తెలుసా? అని ఆమె నిలదీశారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?