Trump In AP: ఏపీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేశారు. సీఎం చంద్రబాబును కలిశారు. అలాగే పిల్లలతో గోళీలాట కూడా ఆడారు. సరదాగా సైకిల్ పై తిరిగారు. కొబ్బరి బొండాలు చేతపట్టుకొని మన ఆతిథ్యాన్ని స్వీకరించారు. అంతేకాదు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గౌతమ బుద్ధుడి బొమ్మను అందుకున్నారు. ఇదంతా ఏపీలో డొనాల్డ్ ట్రంప్ పర్యటన సంధర్భంగా జరిగిన విషయం.
ఇదేంటి మాకు తెలియకుండా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు వచ్చారని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బిల్ క్లింటన్ హైదరాబాద్ ను చూసి షాక్ కు గురయ్యారు. వారెవ్వా అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
సీఎం చంద్రబాబును విజన్ సీఎం అంటూ కొనియాడారు. అలా హైటెక్ సీఎం చంద్రబాబు అంటే ఇతర దేశాలలో కూడా స్పెషల్ క్రేజ్. 20 ఏళ్ల ముందు ఆలోచనలతో ముందుకు సాగడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అంటారు. అందుకే ఉమ్మడి రాష్ట్ర సీఎంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది పరచిన తీరు నేడు తెలంగాణ రాష్ట్రానికి భారీ ఆదాయాన్ని తెచ్చే నగరంగా మారిందని మేధావులు అంటుంటారు.
అయితే ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా 2047 విజన్ తో సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఇదంతా అలా పక్కన ఉంచితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఏఐ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసి తెలుగు తమ్ముళ్లు తెగ సంబర పడిపోతున్నారు. ఆ ఏఐ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సీఎం చంద్రబాబు కలిసి సైకిల్ పై సవారీ చేయడం విశేషం.
Also Read: Rajiv Yuva Vikasam Scheme: ఈ తప్పు అస్సలు చేయవద్దు.. 5 ఏళ్లు ఈ పథకానికి దూరమే!
అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ సరదాగా పిల్లలతో గోళీలు ఆటలాడడం, బొంగరం తిప్పడం వంటి దృశ్యాలు ఇందులో ఉండడం విశేషం. ఏపీని ట్రంప్ సందర్శిస్తే ఎలా ఉంటుందో అనే ఊహాగానంతో ఈ వీడియో క్రియేట్ చేసినట్లు, ఈ కళాకృతి AI ద్వారా రూపొందించబడిందని, ఎవరికీ హాని కలిగించడానికి, బాధపెట్టడానికి ఉద్దేశించబడలేదని కూడా వీడియో క్రియేటర్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తుందని, చివరికి డొనాల్డ్ ట్రంప్ కూడా ఏపీకి ఏదొక రోజు రాక తప్పదని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.
Donald Trump and Chandrababu Naidu Garu ✌️🤩
What if Trump visits Andhra Pradesh and CBN as CM hosting him !
Note: This art work is AI – generated and not intended to harm or offend anyone. Created purely for artistic expression.#ChandrababuNaidu #Andrapradesh#TDPTwitter pic.twitter.com/IsJX4OxGAP
— 𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 (@Trends4TDP) April 17, 2025