PM Modi visit to Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను ఉన్నతాధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. వచ్చే నెల 2 న మోడీ చేతుల మీదుగా అమరావతి పనుల పునః ప్రారంభం కానున్న సందర్భంగా దాదాపు 90 శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
సభా వేదిక వద్దకు వచ్చేందుకు అవసరమైన రోడ్లను గుర్తించి మొత్తం11 పార్కింగ్ ప్రాంతాలు, 8 రోడ్లను గుర్తించామని అన్నారు. కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాలు భూమిని రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని పునర్నిర్మాణ పనుల ఘనత రైతులకే దక్కుతుందన్నారు.
ప్రధాని సభ వద్ద రైతులను గౌరవించాలని సీఎం చెప్పారని అన్నారు. మొత్తం మూడు స్టేజ్ లు ఏర్పాటు చేస్తున్నామని అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామని తెలిపారు. ప్రజలు ల్యాండ్ పూలింగ్ కు అంగీకరిస్తే చేస్తాం లేని పక్షం లో భూసేకరణ ఆప్షన్ ఆలోచిస్తాం.
Also read: Pawan Kalyan: పిఠాపురంకు పవన్.. వర్మ సెగ పుట్టించేనా?
హైదరాబాద్ లో ఒక ఎయిర్‌పోర్ట్ ఉన్నప్పటికీ శంషాబాద్ నిర్మించాం. ఇప్పుడు రెండవ ఎయిర్‌పోర్ట్ లేకుండా వుంటే హైదరాబాద్ లో ఇప్పుడు 10శాతం విమానాలు కూడా దిగేవి కావు. రానున్న 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని సీఎం అమరావతి నిర్మాణం చేస్తున్నారు.
పెరిగిన భూముల విలువ నిలవాలన్నా, పెరగాలన్నా ప్రజలు ఖచ్చితంగా ఉండాలన్నారు. ప్రజలు లేకపోతే భూముల విలువ పడిపోతుందని, ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు .స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంటేనే స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయని మంత్రి తెలిపారు.