Maha-Kumbh-2025
జాతీయం

Maha Kumbh: కుంభమేళాలో మరోసారి ఆంక్షలు విధింపు

Maha Kumbh: మహా కుంభమేళా మరోకొన్ని గంటల్లో ముగియనుంది. దాంతో కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు బారులు తీరుతున్నారు. అందులోను ఆఖరి రోజైనా బుధవారం శివరాత్రి కావడంతో రద్దీ మరింత పెరిగనుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూపీ ప్రభుత్వ అలర్ట్ అయింది.అందులో భాగంగానే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికిల్ జోన్ గా మార్తుస్తున్నట్లు ప్రకటించింది.

దాదాపు 45 రోజులుగా ఈ వేడుక జరగుతోంది. గతంలో మౌని అమావాస్య, వసంత పంచమి వంటి పర్వదినాలు రావడంతో భక్తుల సంగమానికి పోటెత్తారు. దాంతో ప్రయాగ్ రాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు 350 కి.మి పొడవున వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ఒక్క కిలోమీటరు వెళ్లడానికి గంటల తరబడి సమయం పట్టింది. నానా యాతన పడవలసి వచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ సాయంత్రం నుంచి ‘నో వెహికిల్ జోన్’ గా మారుస్తున్నారు.

అయితే, స్థానికుల కోసం నిత్యావసరాలను తీసుకొచ్చే వాహనాలను మాత్రమే అనుమతినిచ్చింది. కుంభమేళాకు వచ్చే వచ్చే భక్తులకు ఆహార, వైద్య సదుపాయాలను ఉచితంగా ఏర్పాటు చేశారు. భక్తులు తమకు సమీపంలోని ఘాట్లలోనే పుణ్య స్నానాలు ఆచరించాలని ప్రభుత్వం సూచించింది.

కాగా, అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ… పలు మార్లు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆడపా దడపా అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణాపాయం తప్పింది. ఇక, మౌని అమావాస్య రోజు తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ ఘటనలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. కుంభమేళాకు వెళ్లే యాత్రికులంతా ఒక్కసారి ఎగబడటంతో తొక్కిసలాటకు దారి తీసింది. అలాగే వేడుకకు వెళ్లేందుకు రైళ్లలో చోటు సరిపోకపోవడంతో పలు చోట్ల భక్తులు ఏసీ భోగీల అద్దాలు పగులగొట్టి అందులో ఎక్కేందుకు ప్రయత్నించారు.

మరోవైపు, కుంభమేళాపై రాజకీయ రగడ కూడా జరిగింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహాకుంభ్ కాదు… మృత్యు కుంభ్ అంటూ వ్యాఖ్యానించారు.  గంగామాతపై తనకు గౌరవం ఉందని చెప్పిన ఆమె.. కుంభమేళాలో ప్రభుత్వం వీఐపీలకే సదుపాయాలు కల్పించిందని, సామాన్యులకు కల్పించలేదని ఆరోపించింది. అలాగే తొక్కిసలాటలో మరణించిన వారికి పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాలను కుంటుంబ సభ్యులకు అప్పగించారని విమర్శించింది. పోస్టుమారటం చేస్తేనే కదా… మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా అందేదన్నారు.  అయితే మమతా వ్యాఖ్యల్ని యూపీ సీఎం యోగి కొట్టి పారేశారు. అలాగే పోలిటికల్ స్ట్రాటజిస్ట్, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సైతం మహాకుంభ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 50 కోట్ల మంది ప్రయాగ్ రాజ్ కు హాజరైనట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తోందని అదంతా తప్పన్నారు.

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు