India vs Pakistan: ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో వేరే చెప్పలా ! టీవీలు, సెల్ ఫోన్లు, రెస్టారెంట్లలో పెట్టే స్క్రీన్లు… ఇలా ఎన్ని ఏర్పాటు చేసినా వేదికలు సరిపోనంత క్రేజ్. భారత్, పాక్ మ్యాచ్ అంటే దేశమంతా పండగే. సందడే. ఆ రోజు ఓ అన్ అఫిషియల్ హాలీడే. అందుకునేమో… ఆ మ్యాచ్ ఎప్పుడూ జరిగిన ఆదివారాలే జరిగేలా ఐసీసీ, బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంటుంటాయి.
సరే.. మ్యాటర్ లోకి వస్తే… ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్ వేదికగా భారత్, పాక్ ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా… రెండు దేశాలు తల ఓ మ్యాచ్ ఆడాయి. అయితే తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించిన భారత్ జోరుమీదుంది. కానీ మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి ఒత్తిడి మీదుంది. దీంతో పాక్ కు ఆదివారం నాటి మ్యాచ్ అత్యంత కీలకమైనది.