Cricketer Chahal : స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధన శ్రీ వర్మ (Dhana Sree Varma) విడాకులు వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గానే ఉంది. అయితే చాహల్ నుంచి ధన శ్రీ వర్మ ఏకంగా రూ.60 కోట్లు భరణం కింద తీసుకుంది అంటూ పెద్ద ఎత్తున జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ వాటికి సరైన ఆధారాలు లేవు. ఈ వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్న టైమ్ లో.. ధన శ్రీ కుటుంబం ఎట్టకేలకు స్పందించింది. ఈ వార్తల్లో నిజాలు లేవంటూ కొట్టి పారేసింది.
అసలు అంత పెద్ద మొత్తంలో ఎవరైనా ఇస్తారా అంటూ మండి పడింది. ఈ భరణం వార్తలు తమ కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయంటూ తెలిపింది ఆమె కుటుంబం. ‘అంత ఇస్తామని అవతలి వాళ్లు చెప్పలేదు.. మేం అడగలేదు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వార్తలు హాని తలపెడుతాయంటూ’ తీవ్రంగా స్పందించింది ధన శ్రీ కుటుంబం. చాహల్, ధన శ్రీ విడాకుల కేసు ప్రస్తుతం బాంద్రా కోర్టులో విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
గతేడాది వీరిద్దరూ పెట్టిన పోస్టులు విడాకుల రూమర్లకు తావిచ్చాయి. ఇద్దరూ ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడంతో పాటు.. ధన శ్రీ వర్మ తన పేరు నుంచి చాహల్ అనే పేరును తొలగించింది. దాంతో అప్పటి నుంచే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ధన శ్రీ వర్మ వేరే అబ్బాయితో డేటింగ్ లో ఉందని.. అందుకే చాహల్ ను వదిలేసిందంటూ రూమర్లు వస్తున్నాయి.