Divya Bharathi on GV Prakash and Saindhavi Divorce
ఎంటర్‌టైన్మెంట్

GV Prakash – Saindhavi: వారి విడాకులకు కారణం నేను కాదు.. నటి సంచలన వ్యాఖ్యలు!

GV Prakash – Saindhavi: సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్, సైంధవి విడాకులకు కారణం నేనంటూ అందరూ నన్ను తిట్టిపోస్తున్నారు. వారు విడిపోవడానికి, విడాకులు తీసుకోవడానికి నేను కారణం కానే కాదని తెలిపింది యువ నటి దివ్య భారతి. జీవీ ప్రకాశ్ – సైంధవి విడాకులు ప్రకటించిన సమయంలో తనపై వచ్చిన విమర్శలపై తాజాగా దివ్య భారతి స్పందించింది.

Also Read- AM Rathnam: ‘వీరమల్లు’ ఫ్యాన్స్‌ని ఖుషి చేసే న్యూస్

‘‘జీవీ ప్రకాశ్ కుమార్‌తో నేను ‘బ్యాచ్‌లర్’ అనే సినిమాకు పనిచేశాను. ఆ సినిమా మాకు మంచి మెమరబుల్ అనుభవాలను ఇచ్చింది. అందులో జీవీతో నా కెమిస్ట్రీ చక్కగా వర్కవుట్ అయింది. అది సినిమాకు ఎంతో ఉపయోగపడింది. ఆ సినిమా తర్వాత మేమిద్దరం రిలేషన్‌లో ఉన్నట్లుగా కొందరు వార్తలు పుట్టించారు. నిజంగా అలాంటిదేమీ లేదు. అదే సమయంలో జీవీ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లుగా ప్రకటించడంతో అంతా.. నా కారణంగానే ఆమెకు విడాకులు ఇస్తున్నాడని విమర్శిస్తూ.. లేనిపోని రాతలు రాస్తూ.. ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేశారు. విడాకులు తీసుకున్న వారిద్దరికీ మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. విడిపోయిన తర్వాత కూడా వారిద్దరూ కలిసి ఓ కన్సర్ట్ నిర్వహించారు. ఆ కన్సర్ట్ తర్వాతైనా నాపై విమర్శలు రావని అనుకున్నాను. కానీ, ఇంకా ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా కొందరు మహిళలు నన్ను బూతులు తిడుతూ మెసేజ్‌లు పెడుతుండేవారు. వాటిని చూసి చాలా బాధగా అనిపించేది. ఆ మెసేజ్‌లు అన్నింటినీ జీవీకి కూడా పంపించేదాన్ని. వాటిని పట్టించుకోకు.. నీ కెరీర్‌పై దృష్టి పెట్టు అంటూ జీవీ సలహా ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఒకటే చెబుతున్నాను. వారిద్దరూ విడిపోవడానికి నేను కారణం కానే కాదు. ఇకపై నన్ను ఈ విషయంలో దూషించవద్దు’’ అంటూ దివ్య భారతి మొరపెట్టుకుంది.

జీవీ ప్రకాశ్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలకు సంగీతం అందిస్తూ, టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకెళుతున్నాడు. మరోవైపు హీరోగానూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘కింగ్‌స్టన్’ సినిమాలో దివ్య భారతి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో హీరోయిన్ దివ్య భారతి ఈ విషయాలను చెప్పుకొచ్చింది. జీవీ ప్రకాశ్ కుమార్, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా నటించిన ‘కింగ్‌స్టన్’ సినిమాను కమల్ ప్రకాశ్ దర్శకత్వంలో జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలు.

ఇవి కూడా చదవండి: 

Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!