NZ Vs PAK
స్పోర్ట్స్

కివీస్ శుభారంభం.. యంగ్, లేథమ్ సెంచరీల మోత

PAK vs NZ : చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ కు షాక్ తగిలింది. సొంత గడ్డపై 30 ఏండ్ల అనంతరం తొలిసారి ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ను తొలి మ్యాచ్ లో కివీస్ కంగుతినిపించింది. తొలుత బ్యాటింగ్ లో రాణించిన కివీస్ జట్టు.. అనంతరం బౌలింగ్ లోనూ చెలరేగి 60 పరుగుల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టులో ఓపెనర్ విల్ యంగ్ (107; 113 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌), టామ్ లేథమ్ (118; 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీల మోత మోగించారు. మిడిలార్డర్లో గ్లెన్ ఫిలిప్స్‌ (61; 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతూ సుడిగాలి హాఫ్ సెంచరీతో పాకిస్థాన్ బౌలర్లను ఆటాడుకున్నాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది.

పాకిస్థాన్ బౌలర్లలో నసీం షా 2, హారిస్‌ రవూఫ్‌ 2, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం 321 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. కివీల కట్టుదిట్టమైన బౌలింగ్ కు తోడు అద్భుత ఫీల్డింగ్ కు పాకిస్థాన్ బ్యాటర్లు దాసోహమన్నారు. పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. భారీస్కోరు ఛేదనలో పాక్ బ్యాటర్లు ఎక్కడా దూకుడు చూపించలేదు. పాక్ బ్యాటర్లలో ఖుష్‌దిల్‌ (69; 49 బంతుల్లో), సల్మాన్ అఘా (42; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే శరవేగంగా పరుగులు చేసారు.

బాబర్ అజామ్ (64; 90 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మరీ నిదానంగా పరుగులు చేయడం పాకిస్థాన్ కొంప ముంచింది. ఇక పాక్ జట్టులోని కీలక బ్యాటర్లు సౌద్ షకీల్ (6), మహ్మద్ రిజ్వాన్ (3), తయ్యబ్ తాహిర్ (1) సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితం కావడంతో పాక్ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. కివీస్ బౌలర్లలో విలియం ఓరోర్క్‌ 3, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 3, మ్యాట్ హెన్రీ 2, మైఖేల్ బ్రాస్‌వెల్, నాథన్ స్మిత్ చెరో వికెట్ తీశారు.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు