అమరావతి, స్వేచ్ఛ: మిర్చి ధరల విషయంలో ఓవైపు పొలిటికల్ హీట్ నడుస్తుండగా, ఇంకోవైపు సీఎం చంద్రబాబు (Cm Chandrababu Naidu) కేంద్రానికి (Central Govt) లేఖ రాశారు. ఏపీలో మిర్చి (Mirchi) రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ధరల స్థిరీకరణ నిధి కింద తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని చెప్పారు. పీడీపీ(ప్రైస్ డెఫిసియన్సీ పేమెంట్) (Pdp) కింద చెల్లింపులు చేయాలని కోరారు. మిర్చి రైతులు నష్టపోతున్న వంద శాతం ధరను చెల్లించాలని, ఈ విషయంలో ఏపీ రైతులను ప్రత్యేక కేసుగా గుర్తించాలని చెప్పారు. గుంటూరు మిర్చి యార్డులో స్పెషల్ వెరైటీ క్వింటాలు ధర రూ.13,600గానూ కామన్ వెరైటీ ధర రూ.11,500గా ఉందన్న సీఎం, 2023-24లో క్వింటాలు ధర రూ.20 వేల వరకూ పలికిందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం 11,67,110 మెట్రిక్ టన్నుల మేర మిర్చి ఉత్పత్తి అయ్యే అవకాశముందని వివరించారు. ఎగుమతులు నిలిచిపోవటంతో ధరల్లో ఇబ్బంది వచ్చిందని, వర్షం కారణంగా పంట దెబ్బతిన్నదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
ఇవీ చదవండి
TDP vs YCP: పొలిటికల్ ఘాటు ; మిర్చి రేటుపై వైసీపీ, టీడీపీ మైలేజ్ ఫైట్
Ys Jagan | ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘన.. జగన్ పై కేసు తప్పదా..?