Ys Jagan
ఆంధ్రప్రదేశ్

Ys Jagan | ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘన.. జగన్ పై కేసు తప్పదా..?

Ys Jagan | మాజీ సీఎం జగన్ ఏం చేసినా దాని చుట్టూ ఏదో ఒక చిన్న వివాదం అయినా నడుస్తోంది. ఇప్పుడు జగన్ చేసిన పనితో ఆయనపై కేసు తప్పదా అనే సంకేతాలు వస్తున్నాయి. జగన్ ఈ నడుమ రాష్ట్రంలో యాక్టివ్ గా పర్యటిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే అక్కడకు వెళ్లి తన వాదన వినిపించేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు ఆయన గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడ రైతులను పరామర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని కూటమి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆయన ఎన్నికల కోడ్ (election code) ను మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. ఈ కోడ్ కారణంగానే జగన్ మిర్చి యార్డు లోపలకు వెళ్లడానికి వీళ్లేదని ఈసీ అధికారులు చెప్పారు. ఈ రెండు జిల్లాల్లో కోడ్ ఉన్నంత వరకు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి వీళ్లేదని ఆదేశించారు. అయినా సరే జగన్ వాటన్నింటినీ పక్కన పెట్టేసి నేరుగా మిర్చియార్డుకు వెళ్లారు. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది.

జగన్ (jagan) మీద కోడ్ ఉల్లంఘన కింద కేసు తప్పదని అంటున్నారు. గతంలో చాలా మంది ఇలా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసుల పాలైన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు జగన్ కు కూడా ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తప్పదని అంటున్నారు కొందరు నేతలు. అసలే అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతున్నారు జగన్. కాబట్టి ఇప్పుడు కొత్త కేసులు తన మెడకు చుట్టుకోకుండా ఉంటే బాగుంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్.. మళ్లీ కొత్త కేసుల్లో ఇరుక్కుని కోర్టు మెట్లు ఎక్కడం ఎందుకు అంటున్నారు.

పైగా మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడితే ఇంకా బెటర్. నిన్న విజయవాడ సబ్ జైలులో వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత జగన్ మాట్లాడుతూ.. పోలీస్ అధికారుల బట్టలూడదీస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారులపై చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా వివాదం చెలరేగింది. జగన్ రాజకీయంగా మళ్లీ పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల చుట్టూ ఇలాంటి వివాదాలు లేకుండా చూసుకోవాలని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు