Champions-Trophy
స్పోర్ట్స్

Champions-Trophy | నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం.. పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్..!

Champions-Trophy | క్రికెట్ ఆటలో వన్డే ప్రపంచ కప్ తర్వాత అంత క్రేజ్ ఉన్నది ఛాంపియన్స్ ట్రోఫీకే. అచ్చం వరల్డ్ కప్ లాగానే ఇందులో జట్లు, ఆటలు ఉంటాయి. ఈ మహాసమరం నేంటి నుంచే ప్రారంభం అవుతోంది. చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ (pakisthan) ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోంది. దుబాయ్ (dubai)లో జరగనున్న ఈ ట్రోఫీలో.. నేడు కరాచి వేదికగా న్యూజిలాండ్ తో పాకిస్థాన్ ఆడబోతోంది. పాకిస్థాన్ తో పోలిస్తే న్యూజిలాండ్ చాలా బలమైన జట్టు. కానీ పాకిస్థాన్ జట్టు ఈ ట్రోఫీని చాలా సీరియస్ గా తీసుకుంది.

ఆతిథ్యం దగ్గరి నుంచి పర్ఫార్మెన్స్ వరకు అన్నింటిలో పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రేపు గురువారం బంగ్లాదేశ్ తో ఇండియా ఆడబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆటలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఎనిమిది జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఇందులో ఏ గ్రూప్ లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ న్నాయి. బీ గ్రూప్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి.

ఈ ఎనిమిది జట్లు నాలుగు వేదికల్లో కలిపి మొత్తం 12 లీగ్ మ్యాచ్ లు ఆడుతాయి. అందులో ఎంపికైన నాలుగు జట్లకు కలిపి రెండు సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. అందులో గెలిచిన రెండు జట్లకు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇందులో మూడు లీగ్ మ్యాచ్ లు మాత్రమే దుబాయ్ లో జరుగుతాయి. మిగతావన్నీ కూడా పాకిస్థాన్ వేదికగానే జరుగుతున్నాయి. ఒకవేళ టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు, ఫైనల్ కు సెలెక్ట్ అయితే ఆ రెండు మ్యాచ్ లు దుబాయ్ లోనే ఉండే అవకాశం ఉంటుంది.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?