Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Deputy Cm) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేడు కుటుంబ సమేతంగా మహా కుంభమేళాకు (Maha Kumbh) వెళ్లనున్నారు. అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు. అనంతరం ప్రయాగ్ రాజ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పవన్ తో యూపీ సీఎం యోగి సైతం పూజలో పాల్గొనున్నట్లు సమాచారం. పవన్ రాక సందర్భంగా మహా కుంభమేళా వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా ఇటీవలే పవన్ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు ఆలయాలను సందర్శించారు. చాలా ఏళ్లుగా శ్రీ అగస్త్య మహాముని ఆలయం, స్వామిమలై శ్రీ సుబ్రహ్మణేశ్వర క్షేత్రం తదితర ఆలయాలను దర్శించాలని అనుకుంటున్నాని, ఇప్పటికి ఆ కోరిక తీరిపోయిందని ఆ సమయంలో ఆయన వివరణ ఇచ్చారు. ఆధ్యాత్మిక యాత్రలో ఆయనతో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కూడా ఉన్నారు.
ఇదిలా వుండగా, ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే ఈ ఉత్సవానికి దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు హాజరవుతున్నారు. సామాన్యులు, స్వామీజీలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మహాకుంభ్ కు వెళ్లి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం ఏపీ మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్ రాజ్ వద్ద పుణ్య స్నానాలు చేశారు. అంతకు ముందు విజయ్ దేవరకొండ సైతం తల్లితో కలిసి వెళ్లారు.
కాగా, జనవరి 13న మొదలైన మహా కుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈ నెల 26వ తేదీ శివరాత్రి ఇది ముగియనుంది. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా భక్తలు అక్కడ పుణ్య స్నానమాచరించినట్లు చెప్తున్నారు. మరో వారం రోజుల సమయమే ఉన్నందున భక్తు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి
Ys Jagan | వంశీపై తప్పుడు కేసులు పెట్టారు.. మాజీ సీఎం జగన్ ఆరోపణ..!
Tuni | తునిలో ఉద్రిక్తత.. రణరంగంలా మారిన వైస్ చైర్మన్ ఎన్నిక..!