Icon Star Allu Arjun
ఎంటర్‌టైన్మెంట్

Allu Arjun: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!

Allu Arjun: ‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఇప్పుడొక ఫోబియా వెంటాడుతుంది. ఆ ఫోబియా నుండి ఆయన బయటపడలేకపోతున్నాడనేది.. ఈ మధ్యకాలంలో ఆయన ప్రవర్తన చూసిన వారంతా అనుకుంటున్నమాట. ఇంతకీ అల్లు అర్జున్ ఏ ఫోబియాతో ఇబ్బందిపడుతున్నాడని అనుకుంటున్నారా? పబ్లిక్‌లోకి రావడానికి అల్లు అర్జున్ భయపడిపోతున్నాడట. ఈ విషయం ఆయన చుట్టూ ఉండేవారు కూడా అనుకుంటుండటం విశేషం. అసలు విషయం ఏమిటంటే..

Also Read- Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?

‘పుష్ప 2’ సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ బాగా భయపడిపోయాడట. అందుకే ఆ రోజు నుండి పబ్లిక్‌లోకి రావడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడని, ఏదైనా సినిమా ఫంక్షన్‌కు గెస్ట్‌గా రమ్మని పిలిచినా కూడా నో చెబుతున్నాడనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ మృతి చెందడంతో పాటు, ఆమె కుమారుడు ఇంకా మృతువుతో పోరాడుతూనే ఉన్నాడు. ఈ మధ్యనే కాస్త ఆ పిల్లాడు కోలుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో తెలియంది కాదు. జైలుకి కూడా వెళ్లివచ్చాడు. అంతే, ఆ రోజు నుండి పబ్లిక్‌లో ఫేస్ చూపించడానికి అల్లు అర్జున్ భయపడిపోతున్నాడని అంటున్నారు. ఇటీవల జరిగిన ‘తండేల్’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన అల్లు అర్జున్, చివరి నిమిషం వరకు ఊరించి, హ్యాండిచ్చాడు. ఆ తర్వాత జరిగిన ‘పుష్ప 2’ సక్సెస్ మీట్‌కి అల్లు అర్జున్ హాజరైనా.. దానిని ప్రైవేట్ వేడుకలా నిర్వహించి, కేవలం చిత్రయూనిట్‌కు మాత్రమే ఆ వేడుకకి అనుమతిని ఇచ్చారు. ఆ వేడుకలో కూడా అల్లు అర్జున్ భయపడుతూనే కనిపించారు.

Allu Sneha Reddy with Vijay Deverakonda Family
Allu Sneha Reddy with Vijay Deverakonda Family

ఈ రెండు వేడుకలు చాలవన్నట్టు, ఇప్పుడు మహా కుంభమేళాకు కూడా వెళ్లడానికి నిరాకరించాడని సమాచారం. అందుకే, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి మాత్రమే ఈ కుంభమేళాలో కనిపించారు. అదీ కూడా అల్లు అర్జున్ సొంత ఫ్లయిట్‌లో విజయ్ దేవరకొండ, వంశీ పైడిపల్లి ఫ్యామిలీతో కలిసి ఆమె కుంభమేళాకు వెళ్లినట్లుగా టాక్ వినబడుతుంది. కుంభమేళాకు వెళితే, ఎటువంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుందో అని భయపడిన అల్లు అర్జున్, తన భార్యను ఒంటరిగా ఆ పుణ్యస్నానానికి పంపించారనేలా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ, బయటికి వచ్చిన ఫొటోలు చూస్తుంటే మాత్రం అది నిజమే అని అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా, సంధ్య థియేటర్ ఘటన మాత్రం అల్లు అర్జున్‌‌లో టన్నుల కొద్ది భయాన్ని నింపిందనేది మాత్రం ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. మరి, అల్లు అర్జున్ ఈ ఫోబియా నుండి ఎప్పుడు భయపడతాడో? ఈ విషయం తెలిసి ఆయన ఆర్మీ సైతం, తమ హీరో త్వరగా ఈ ఫోబియా నుండి బయటపడాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: 

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు