Tuni
అమరావతి, ఆంధ్రప్రదేశ్

Tuni | తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా..!

Tuni | తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా.. తాజాగా మంగళవారం కూడా వాయిదా పడటం సంచలనం రేపుతోంది. ఉదయం నుంచి మున్సిపల్ ఆఫీస్ వద్ద నానా రచ్చ జరుగుతోంది. వైసీపీ (ycp), టీడీపీ (tdp) కేడర్ మధ్య తోపులాట, ఘర్షణలు జరుగుతున్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసినా గొడవ కంట్రోల్ కాలేదు. చివరకు కోరం లేకపోవడంతో అధికారుకులు ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మూడుసార్లు వాయిదా పడటంతో ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

ఎక్స్ అఫీషియో సభ్యురాలితో కలిపి 29 మంది ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉండగా.. కేవలం 10 మంది మాత్రమే పాల్గొనడంతో ఎన్నిక వాయిదా వేశారు. వైసీపీకి చెందిన ఐదుగురు టీడీపీలోకి వెళ్తారనే ప్రచారంతో.. వైసీపీ అలెర్ట్ అయింది. వైసీపీ కౌన్సిలర్లను ప్రైవేట్ బస్ లో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తరలించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు పార్టీల కేడర్ నడుమ గొడవ సంచలనంగా మారింది. ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!