Tuni
అమరావతి, ఆంధ్రప్రదేశ్

Tuni | తునిలో ఉద్రిక్తత.. రణరంగంలా మారిన వైస్ చైర్మన్ ఎన్నిక..!

Tuni | తునిలో హై డ్రామా కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట జరుగుతోంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ను నేడు ఎన్నుకోవాల్సి ఉండగా.. మున్సిపల్ ఆఫీస్ వద్ద రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. రెండు పార్టీల కేడర్ ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు. తునిలో 28 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో 18 మంది వైసీపీలో (ycp) ఉంటే.. టీడపీలో 10 మంది ఉన్నారు. వైస్ చైర్మన్ పదవిని టీడీపీ (tdp) దక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకోసం వైసీపీ నుంచి 5 మంది కౌన్సిలర్లు టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ కౌన్సిలర్లను ప్రైవేట్ బస్సులో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో రెండు పార్టీల కేడర్ మున్సిపల్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వైసీపీ నుంచి కౌన్సిలర్లు వెళ్లిపోకుండా చూసేందుకు దాడిశెట్టి రాజా చేస్తున్న ప్రయత్నాలతో టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడిశెట్టి రాజా రౌడీయిజం చేస్తున్నారంటూ టీడీపీ కేడర్ ఆరోపిస్తోంది. దీంతో ఇటు వైసీపీ కేడర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ పార్టీ కౌన్సిలర్లను కూటమి లాక్కెళ్లాలని చూస్తోందంటూ చెబుతున్నారు.

ఇలా రెండు పార్టీల నడుమ తీవ్ర వాగ్వాదం, తోపులాట జరుగుతోంది. దాంతో తునిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఆందోళన మొదలైంది. అటు ఉద్రిక్త పరిస్థితుల నడుమనే ఎన్నిక నిర్వహిస్తున్నారు అధికారులు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు