Gujarath
క్రైమ్, జాతీయం

Gujarath | గుజరాత్ లో సంచలనం.. యూట్యూబ్ లో మహిళా రోగుల ప్రైవేట్ వీడియోలు

Gujarath | గుజరాత్ రాష్ట్రంలో సంచలన ఘటన జరిగింది. ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రిలోని మహిళా రోగులకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు యూట్యూబ్ లో దర్శనం ఇచ్చాయి. ఇది చూసి అంతా షాక్ అయిపోయారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుజరాత్ (gujarath) లోని రాజ్ కోట్ పాయల్ ప్రసూతి ఆస్పత్రికి నిత్యం వందలాది మంది మహిళా రోగులు, గర్భిణులు వస్తుంటారు. ఈ హాస్పిటల్ లోని అన్ని రూముల్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి.

ఈ హాస్పిటల్ లో మహిళా రోగులకు నర్సులు సూదులు వేస్తున్న వీడియోలు సడెన్ గా యూట్యూబ్ (youtube) లో దర్శనం ఇచ్చాయి. ఈ వీడియోలు కాస్త ఆస్పత్రి సిబ్బంది దృష్టికి చేరింది. వెంటనే వాళ్లు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు హ్యాకింగ్ కు గురైనట్టు చెప్పారు. ఓ యువకుడు ఈ వీడియోలను యూట్యూబ్ లో పోస్టు చేసినట్టు గుర్తించారు. ఈ విషయంపై ఆస్పత్రి డాక్టర్ అమిత్ అక్బరీ స్పందించారు.

కేసు విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తామంటూ తెలిపారు. రాజ్ కోట్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. అయితే నర్సులు సూదులు వేసే రూమ్ లో సీసీ కెమెరాలు ఉండటంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే మహిళల ప్రైవేట్ భాగాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యే అవకాశం ఉంటుందని విమర్శలు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!