Crime News | భార్యపై డీఐజీ ఆఫీసర్ దాడి.. కేసు నమోదు..!
Crime News
క్రైమ్

Crime News | భార్యపై డీఐజీ ఆఫీసర్ దాడి.. కేసు నమోదు..!

Crime News | భార్యపై దాడి చేసిన ఘటనలో ఉన్నతాధికారిపై కేసు నమోదైంది. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖలో నెల్లూరు డీఐజీ (dig)గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ (kiran kumar) కొన్నేళ్ళ కింద ఎల్ ఐసీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న అనసూయ రాణిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చాలా ఏళ్లుగా వీరిద్దరూ అన్యోన్యంగానే ఉంటున్నారు.

దంపతుల నడుమ కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఏడాది కిందటి నుంచి వేర్వేరుగానే ఉంటున్నారు. సోమవారం రాత్రి సమయంలో ఇద్దరి నడుమ మరోసారి గొడవ జరిగినట్టు తెలుస్తోంది.దాంతో కిరణ్ కుమార్ ఆవేశంతో భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆమె స్పృహ కోల్పోయింది.

 

స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేరిన ఆమె.. ఆ తర్వాత అరండల్ పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది. కిరణ్​ కుమార్ ఉద్దేశ పూర్వకంగానే తనపై దాడి చేసినట్టు ఆమె వివరించింది. తమకు పిల్లలు లేరని.. ఓ పాపను దత్తత తీసుకున్నట్టు చెప్పింది. 2012లొ సరోగసి విధానం ద్వారా ఓ బాబుకు తల్లి అయినట్టు స్పష్టం చేసింది. వేరే మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..