Delhi CM
జాతీయం

Who is Delhi CM: ఢిల్లీ సీఎం.. ఇంకా ఎందుకీ సస్పెన్స్?

ఫలితాలు వచ్చి 10 రోజులు
ఇంకా తెగని పంచాయితీ!
నేడో రేపో ముఖ్యమంత్రి ఎంపిక!
దృష్టిసారించిన బీజేపీ అధిష్ఠానం
19న పార్టీ శాసనసభాపక్ష సమావేశం
20న ప్రమాణస్వీకారోత్సవం!
పర్వేష్ వర్మకే ఎక్కువ అవకాశాలు
రేఖా గుప్తా నుంచి గట్టి పోటీ

న్యూఢిల్లీ, స్వేచ్ఛ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి వారం రోజులకుపైనే అయ్యింది. 70 సీట్లలో ఏకంగా 48 స్థానాలు గెలిచిన కమలనాథులు హస్తిన పీఠాన్ని సొంతం చేసుకున్నారు. కానీ, ఫలితాలు వెలువడి 10 రోజులు గడిచినా ముఖ్యమంత్రి ఎవరు? అనే ఉత్కంఠ మాత్రం ఇంకా వీడడం లేదు. అయితే, ఒకటి రెండు రోజుల్లో సీఎం అభ్యర్థిత్వంపై స్పష్టత వస్తుందని బీజేపీ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుందని చెబుతున్నారు. సీఎం ఎవరనే విషయానికి వస్తే, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన విజయం సాధించిన పర్వేష్ వర్మకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నేతలు చెబుతున్నారు. రేఖా గుప్తా, ఆశిష్ సూద్, సతీష్ ఉపాధ్యాయ్, శిఖా రాయ్ వంటి కీలక నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, పర్వేష్ వర్మ వైపు ఎక్కువగా మొగ్గు ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటు సీఎం పీఠానికి పోటీ పడుతున్నవారు సైతం పర్వేష్ వర్మ పట్ల సానుకూలంగా ఉండొచ్చని అంటున్నారు. ఢిల్లీలో జాట్ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు కావడం, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై అసామాన్య విజయం సాధించడం కలిసి వచ్చే అంశాలని బీజేపీ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీఎం అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసిన విధానాన్ని గమనిస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని కొత్తవారికి అప్పగించే విషయంలో కమనాథులు వెనుకాడడం లేదు. ప్రముఖ నేతలు కాకపోయినా సమర్థత ఉందని భావిస్తే బాధ్యతలు కట్టబెడుతున్న ధోరణి కనబడుతోంది. ఈ కోణంలో చూస్తే, పర్వేష్ వర్మకు ఇతరుల మద్దతు ఉంటుంది, కాబట్టి సీఎం పదవిని అప్పగించే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ బీజేపీ సీనియర్ నాయకురాలు రేఖా గుప్తా కూడా పర్వేష్‌కు బలమైన పోటీదారుగా మారారంటూ పలు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పార్టీ సీనియర్ అయిన రేఖా గుప్తా గతంలో బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, కౌన్సిలర్‌గా, ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు. సమర్థవంతంగా పనిచేస్తారనే పేరు ఆమెకు ఉంది. కాబట్టి పర్వేష్ వర్మకు ఆమె నుంచి పోటీ తప్పదని తాజా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Also Read- Funds Shortage for Govt: ప్ర‌భుత్వానికి పైస‌ల ప‌రేషాన్!

ఐదేళ్లలో ముగ్గురు సీఎంలు
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం అంతకంతకూ ఆలస్యమవుతుండడంపై విపక్ష ఆప్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. మునుపటి మాదిరిగానే వచ్చే ఐదేళ్లలో ఢిల్లీకి ముగ్గురు సీఎంలు ఉంటారేమోనని ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ మండిపడ్డారు. ముగ్గురు వేర్వేరు సీఎంలను చూడడం ఖాయమని అన్నారు. 10 రోజులు గడిచినా సీఎంను ఎన్నుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థే లేరు, అందుకే చరిత్ర పునరావృతం కావడం ఖాయమనేలా గోపాల్ రాయ్ అన్నారు. ఢిల్లీలో గత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారంటూ ప్రస్తావించారు. సీఎం ఎంపికలో జాప్యం చూస్తుంటే పార్టీలో అంతర్గత వర్గపోరు ఉన్నట్టు అర్థమవుతోందని పేర్కొన్నారు. బీజేపీ దృష్టి ఎప్పుడూ పాలనపై ఉండదని, ఢిల్లీకి ఎవరు సీఎం అవుతారనే ఉంటుందని, అందుకే ఆ పార్టీలో వర్గపోరు ఉంటుందని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ విమర్శించారు.

20న ప్రమాణ స్వీకారం
ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ, ఈ నెల 20న న్యూఢిల్లీ తదుపరి సీఎం ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌లీలా మైదాన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని అంటున్నారు. నిజానికి, బీజేపీ శాసనసభా సమావేశం సోమవారమే జరగాల్సి ఉందని, కానీ వాయిదా పడిందని కమలనాథులు చెబుతున్నారు. తిరిగి ఫిబ్రవరి 19న శాసనసభా పక్ష సమావేశం జరగనుందని, ఈ భేటీలో పార్టీ సభాపక్ష నేతను ఎన్నుకోనున్నట్టు బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు వివరించారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఫిబ్రవరి 18న నిర్వహించాలని తొలుత భావించామని, కానీ ఫిబ్రవరి 20కి వాయిదా వేసినట్టు వివరించారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు బీజేపీ పాలక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎన్డీయే నేతలు, పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రీడాకారులు, సాధువులు కూడా హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి:

YCP Leaders Arrest: హిట్ లిస్టులో ఉన్నదెవరు?

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు