Rana Daggubati: రానా దగ్గుబాటి (Rana Daggubati).. నటుడి కంటే ప్రొడ్యూసర్‌గానే ‘ది ఓజీ’ అనిపించుకుంటున్నాడు. టాలీవుడ్‌లోనే కాదు సౌతిండియన్ సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, మేనేజర్‌గా మారిపోయి మంచి కంటెంట్ ఉన్నా సినిమాలకు వెన్ను దన్నుగా నిలుస్తున్నాడు. కేవలం సినిమాలకు మాత్రమే కాదు డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ టాలెంట్ ఉన్నా ఎవరికైనా తాను తోడుంటా అంటూ వివిధ సంస్థలను నెలకొల్పాడు. సాహిత్యం, మ్యూజిక్, మూవీస్, వెబ్ సిరీస్, టీవీ షోస్ ఏదైనా అందరికి అండగా నిలుస్తూ.. ‘రానా ది గ్రేట్’ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ‘ది స్పిరిట్ మీడియా’ (Spirit Media) . ఈ సంస్థ నుంచి మరో బోల్డ్ స్టెప్ వేసేందుకు రానా సిద్ధమవుతున్నాడు.
ప్రస్తుతం ‘ది స్పిరిట్ మీడియా’ దమ్మున్న స్టోరీ టెల్లర్స్‌కు కేరాఫ్‌గా మారింది. ఇప్పటికే విభిన్నమైన దమ్మున్న కథలను తెరకెక్కించిన స్పిరిట్ మీడియా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో వీడియోలో ‘ది రానా దగ్గుబాటి షో’తో పాటు దుల్కర్ తో ‘కాంత’, ప్రియదర్శితో ‘ప్రేమంటే’, ‘డార్క్ చాక్లెట్’ వంటి భిన్న కథలను తెరకెక్కిస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ సంస్థ ప్రకటించిన ఓ కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇలాంటి బోల్డ్ స్టెప్ వేసినందుకు రానా అండ్ టీమ్ ను విమర్శకులు సైతం శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే..
Also Read: ‘వెంకీ అట్లూరి’ ఎటుపోతున్నావ్ సామి..
‘మల్లేశం’ వంటి నేచురల్ రా సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు రాజ్ రాచకొండ (Raj Rachakonda). అనంతరం హిందీలో ‘8 A.M. మెట్రో’ వంటి మరో ఆణిముత్యాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం ఆయన స్పిరిట్ మీడియాతో కలిసి మరో రా అటెంప్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌పై ప్రపంచ ప్రఖ్యాత రచయిత జార్జ్ ఆర్వెల్(George Orwell) రాసిన మిస్సైల్ లాంటి లైన్ ” చట్టం ముందు అందరు సమానమే కానీ.. కొందరు ఎక్కువ సమానం” అని రాసి ఉండటం ఆసక్తిని రేపుతోంది. అలాగే బ్యాగ్రౌండ్ లో సమ తూకంలో లేని తూకం ఆకర్షిస్తుంది. మరో పోస్టర్ పై ‘ మన సమాజంలో చట్టం అందరికి సమానంగా వర్తిస్తుందా..?” అనే ప్రశ్నతో ఈ సినిమాని ఏ ఉద్దేశం తెరకెక్కిస్తున్నారో చెప్పకనే చెప్పేశారు. అన్ని రకాలుగా ముందుకెళ్తున్న టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు కూడా రావడం చాలా సంతోషాన్ని కలగజేస్తుందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే కేవలం దర్శకుడి పేరు మినహా ఏ ఇతర వివరాలను వెల్లడించకపోవడం ఆడియెన్స్ లో మరింతా క్యూరియాసిటీని పెంచుతోంది.