Venky Atluri
ఎంటర్‌టైన్మెంట్

Venky Atluri: ‘వెంకీ అట్లూరి’ ఎటుపోతున్నావ్ సామి..

Venky Atluri: ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమాతో సూపర్ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) ఫ్యూచర్ జర్నీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కెరీర్ ఆరంభంలో తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే వంటి సినిమాలతో ఒకే అనిపించుకున్న వెంకీ.. ఆ తర్వాత తీసిన మూవీస్ తో మాత్రం ఎక్స్ట్రార్డినరీ అనిపించుకున్నాడు. అయితే ఈ సినిమాలు నేరుగా తెలుగులో కాకుండా ఇతర భాషలో, ఇతర నటులతో తెరకెక్కించడం గమనార్హం. కాగా, సూపర్ ఫామ్‌ అందుకున్నాక ఆయన తెలుగు నటులకు ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని అంతా భావించారు. కానీ.. వెంకీ మాత్రం రూట్ మార్చేలా కనిపించడం లేదు. ఇంతకు అట్లూరి ఏం చేస్తున్నాడు, దానికి కారణాలేంటి అనే దానిపై చిన్న విశ్లేషణ..

‘కంగువా’ డిజాస్టర్ తర్వాత కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య.. స్ట్రాంగ్ లైనప్ తో కనిపించడం అభిమానులకు రిలీఫ్ కలగజేస్తోంది. ప్రస్తుతం ఆయన కార్తీక్ సుబ్బరాజ్ తో రెట్రో, ఆర్జే బాలాజీ తో సూర్య 45 ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. కాగా, సూర్య 45 రిలీజ్ కాగానే వెంకీ అట్లూరితో ‘సూర్య 46’ (Suriya 46) ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. మే నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ కానుంది. ఇది సూర్య ఫ్యాన్స్ కు సంతోషం కలుగజేసిన టాలీవుడ్ అభిమానులకు మాత్రం నచ్చట్లేదు. ఎందుకంటే..

Also Read: పోరా.. ఎస్‌కెఎన్‌‌పై మండిపడిన హీరోయిన్

రంగ్ దే సినిమా వరకు యావరేజ్ డైరెక్టర్ అని టాలీవుడ్ ఆయనకు ముద్ర వేసింది. ఆ తర్వాత ఆయన ఇంట్రెస్టింగ్ కథలైనా వాతి(సార్), లక్కీ భాస్కర్ లను టాలీవుడ్ హీరోలకు వినిపించిన ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కొందరు టాప్ హీరోలు ఈ ప్రాజెక్టులను రిజెక్ట్ చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. దీంతో ఆయన ధనుష్, దుల్కర్ సల్మాన్ లను ఆశ్రయించి సౌత్ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ హిట్లను చూసి తెలుగు ప్రేక్షకులు పరిశ్రమకు మంచి దర్శకుడు దొరికాడు కానీ.. ఇతర ఇండస్ట్రీల నటులతో కొలాబరేట్ కావడాన్ని సహించలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా సూర్యతో ఐకానిక్ ప్రాజెక్ట్ తెరకెక్కించడం బాలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాతి, లక్కీ భాస్కర్, సూర్య 46 సినిమాలను మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి టాలీవుడ్ ఆదర్శం అనే చెప్పే ప్రముఖ నిర్మాత నాగ వంశీ సితార బ్యానర్ కింద తెరకెక్కించడం విశేషం. క్లిష్టమైన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో జావాబులు ఇచ్చే నాగ వంశీ ఈ ప్రాజెక్ట్ గురించి ఎలా రెస్పాండ్ అవుతాడో అని అందరు ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి:

Jr NTR: ‘బ్రహ్మా ఆనందం’పై ఎన్టీఆర్ పోస్ట్ వైరల్..

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!