Dinesh Karthik is the record holder in IPL 2024
స్పోర్ట్స్

IPL 2024: రికార్డుల మోత, ఐపీఎల్‌లో సత్తాచాటిన దినేష్ కార్తీక్‌

Dinesh Karthik is the record holder in IPL 2024 : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు దినేష్ కార్తిక్‌ తాజాగా ఐపీఎల్‌లో అరుదైన రికార్డుని నెలకొల్పాడు. డెత్‌ ఓవర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్‌ని కలిగిన క్రీడాకారుడిగా అవతరించాడు. అలాగే డెత్‌ ఓవర్లలో అత్యధిక రన్స్‌ చేసిన రెండో బ్యాటర్‌ కూడా దినేష్ కార్తీకే కావడం గమనార్హం. 2022 నుంచి ఐపీఎల్‌లో నమోదైన లెక్కల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.డెత్‌ ఓవర్లలో అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 280గా ఉండటం విశేషం. అలాగే 203.27 స్ట్రైట్ రేట్‌తో 2022 నుంచి ఇప్పటివరకు డెత్ ఓవర్లలో 372 పరుగులు చేశాడు. ఇక అత్యధిక పరుగులు చేసిన వారిలో దినేష్ కార్తిక్ కంటే ముందు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మేయర్ ఉన్నారు. అతడు 383 పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో ఉన్న టాప్ 5 ఆటగాళ్లలో మిగతా ముగ్గురు వచ్చేసి కొల్‌కతా నైట్‌ రైడర్స్‌కు చెందిన రింకూ సింగ్‌, ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌ టీమ్‌ డేవిడ్‌ గుజరాత్‌ టైటాన్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఉన్నారు.

ఇక సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో చిన్నజీయస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్లాసిక్‌ ఇన్నింగ్స్‌కి తోడు చివరలో దినేష్ కార్తీక్‌, మహిపాల్ లోమ్రోర్ మెరుపులు మెరిపించడంతో బెంగళూరు 4 వికెట్ల తేడాతో సాధించింది. ఇందులో దినేష్ కార్తీక్ కేవలం 10 బంతుల్లో 28 రన్స్‌ చేయడం విశేషం. దాంతో ఆర్‌సీబీ ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. అంతకుముందు మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ 37 బంతుల్లో 45 పరుగులు చేశాడు. శిఖర్‌తో పాటు జితేష్ శర్మ, శామ్‌ కర్రన్ పరుగులతో పర్వాలేదనిపించాడు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యక్స్‌ వెల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అలాగే యశ్ దయాల్, అల్జారి జోసఫ్ తలో వికెట్ పడగొట్టారు.

Read Also : సెంచరీలతో క్రికెట్ హిస్టరీ రిపీట్

అనంతరం 177 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ఆర్‌సీబీ వరుస బ్రేకుల్లో వికేట్లను వదులుకుంది. కానీ..ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రావడం ఆగలేదు. ఎప్పటిలాగే చేజింగ్‌లో తనకు మించినవారు లేరని నిన్నటి ఇన్నింగ్స్‌తో మరోసారి విరాట్ నిరూపించాడు.పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్‌ప్రీత్ బ్రార్‌, క‌గిసో ర‌బాడ త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. కాగా, 77 ప‌రుగుల‌తో క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?