Comedian Yogi Babu
ఎంటర్‌టైన్మెంట్

Yogi Babu: యాక్సిడెంట్ నిజమే కానీ.. వైరలవుతోన్న వార్తలపై యోగి బాబు క్లారిటీ

Yogi Babu: ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఫామ్‌లో ఉన్న కమెడియన్ ఎవరంటే తెలుగు వాళ్లు ఏమోగానీ, తమిళ వాళ్లు మాత్రం వెంటనే చెప్పే పేరు ‘యోగిబాబు’. క్షణం తీరిక లేకుండా, ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు బ్రహ్మానందం ఎలా అయితే బిజీగా ఉండేవారో.. అలా బిజీ నటుడిగా యోగిబాబు కొనసాగుతున్నారు. కమెడియన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా కూడా యోగిబాబుతో దర్శకనిర్మాతలు సినిమాలు చేస్తున్నారంటే ఆయన ఎంత ఫేమస్ నటుడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నటుడిపై ఆదివారం ఉదయం నుండి ఒకటే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలలోని సారాంశం ఏమిటంటే.. యోగి బాబు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో యోగిబాబుకు తీవ్ర గాయాలు అయ్యాయనేలా ఒకటే వార్తలు. ఈ వార్తలపై తాజాగా యోగి బాబు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. అసలు విషయం ఏమిటో చెప్పారు.

Also Read: Krishnaveni: ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన నటి, నిర్మాత మృతి

ప్రమాదం జరిగింది కానీ..
చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న యోగిబాబు కారు వాలాజా పేట టోల్ ప్లాజా సమీపంలో తెల్లవారు జామున 3 గంటలకు యాక్సిడెంట్‌కు గురైందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బారికేడ్లను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందనేలా ఉదయం నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో యోగి బాబు స్పృహ కోల్పోయాడని, ఆయనని హాస్పిటల్‌కి తరలించారనే వార్తలు చూసి.. ఆయన అభిమానులలో ఆందోళన మొదలైంది. అసలు యోగి బాబుకు ఏమైందో అంటూ, ఆయన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు వరసగా ఫోన్లు వస్తుండటంతో.. విషయం తెలుసుకున్న యోగి బాబు.. ఆ వార్తలలో నిజంగా లేదని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘నేను క్షేమంగా ఉన్నాను.. నాపై వస్తున్న వార్తలలో నిజం లేదు. యాక్సిడెంట్ జరిగింది నిజమే కానీ, ఆ యాక్సిడెంట్‌ జరిగిన కారులో నేను కానీ, నా సహాయకుడు కానీ లేము’ అనేలా యోగిబాబు క్లారిటీ ఇచ్చారు.

‘ప్రమాదం జరిగిన మాట నిజమే. కానీ మేము ఆ కారులో లేము. మా నిర్మాణ సంస్థకి చెందిన వాహనం బారికేడ్లను ఢీ కొట్టి ఆగిపోయింది. మేము ఆ కారు కంటే ముందు వెళ్లిపోయాం. యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసి, మళ్లీ వెనక్కి వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాం’’ అని యోగిబాబు అసలు విషయం చెప్పారు. యోగి బాబు క్లారిటీతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. యాక్సిడెంట్ అని తెలిసి చాలా ఆందోళన చెందామని, మీరు స్పందించి మంచి పని చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి రూమర్స్‌ని మీరు కూడా పట్టించుకోవద్దు అంటూ యోగిబాబుకి కొందరు సలహాలు ఇస్తున్నారు. ఇదే ప్రమాదంపై యాక్టర్ ఉదయ కూడా ఓ వీడియోను విడుదల చేసి.. యోగిబాబు చెప్పిన విషయాన్నే తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Jr NTR: ‘బ్రహ్మా ఆనందం’పై ఎన్టీఆర్ పోస్ట్ వైరల్..

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!