Jr NTR about Brahma Anandam
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR: ‘బ్రహ్మా ఆనందం’పై ఎన్టీఆర్ పోస్ట్ వైరల్..

కామెడీ కింగ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. తాతా మనవళ్లుగా వారిద్దరూ ఈ సినిమాలో నటించారు. ‘మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పించారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమాకు వస్తున్న స్పందనపై తాజాగా మ్యాన్ మాస్ మాసెస్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.

Also Read: Krishnaveni: ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన నటి, నిర్మాత మృతి

‘బ్రహ్మా ఆనందం’ సినిమా గురించి చాలా పాజిటివ్ విషయాలను వింటున్నాను. రాజా గౌతమ్‌కు, బ్రహ్మానందంగారికి, ఇంకా చిత్రయూనిట్ మొత్తానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని పోస్ట్ చేసిన తారక్ ‘బ్రహ్మా ఆనందం’ సినిమాకు సంబంధించిన ‘బస్ స్టాప్ స్నీక్ పీక్’ను విడుదల చేశారు. ప్రస్తుతం తారక్ పోస్ట్‌ వైరల్ అవుతోంది. ‘బస్ స్టాప్ స్నీక్ పీక్’ విడుదల చేసి, టీమ్‌ని ప్రశంసించిన తారక్‌కు ‘బ్రహ్మా ఆనందం’ చిత్ర టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ వంటివారు కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ తెరకెక్కించారు. రీసెంట్‌గా జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ సక్సెస్ మీట్‌లో బ్రహ్మానందం చిత్ర సక్సెస్‌పై తన ఆనందాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో

Jr NTR Post on Brahma Anandam
Jr NTR Post on Brahma Anandam

‘‘ఈ సినిమాను చూసిన వారంతా మా అబ్బాయి రాజా గురించే మాట్లాడుతున్నారు. మీ కన్నా.. మీ అబ్బాయి బాగా నటించాడని మెచ్చుకుంటూ ఉంటే తండ్రిగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ రొటీన్ పాత్రలు కాకుండా, కాస్త కొత్త పాత్రలను చేయాలని ఎప్పుడూ కోరుకుంటాను. చిన్న చిన్న పాత్రలే వస్తున్నా.. నన్ను అభిమానించే వారి కోసం ఏదైనా కొత్తగా అనిపించాలనే ఉద్దేశంలోనే సినిమాలను చేస్తున్నాను. చాలా కాలం తర్వాత ఈ సినిమా రూపంలో ఓ మంచి సినిమాను, అందులో మంచి పాత్రను చేశాననే సంతృప్తి కలిగింది. ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించే గొప్ప అంశాలేమీ ఇందులో లేవు. నేను, వెన్నెల కిషోర్, స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్, నా కొడుకు రాజా గౌతమ్‌ మాత్రమే ఉన్నాం. ‘మిమ్మల్ని చూడడానికే థియేటర్లకు జనాలు వస్తున్నారు’ అని వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ‘రంగమార్తాండ’లో చేసినటువంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నాను. డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి. నేనంటే ఉన్న ఇష్టంలో కొందరు ఒక్కరోజు పాత్ర ఉంది సార్.. చేస్తారా? అని అడుగుతున్నారు. యంగ్ దర్శకులు వచ్చి.. ఒక్క రోజు పాత్ర ఉంది.. చేయండి సర్ అని అడుగుతుంటారు. ఒక్క రోజు పాత్ర అయినా నేను ఆ పాత్ర ఎందుకు చేస్తున్నానంటే.. దాని వల్ల వాళ్లకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా? అని నేను చిన్న పాత్రల్ని అయినా చేస్తున్నా. నా కోసం ఇంత మంది థియేటర్లకు వస్తున్నారని తెలిసి ఎంతో ఆనందమేస్తోంది’’ అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

Mangli Open Letter: నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. అదంతా ఫేక్ ప్రచారం

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు