Manchu Manoj | ఆస్తి గొడవ కాదు, ఎమ్మెల్యేకి మంచు మనోజ్ రిక్వెస్ట్
Manchu Manoj
ఎంటర్‌టైన్‌మెంట్

Manchu Manoj: ఇది ఆస్తి గొడవ కాదు.. ఎమ్మెల్యేకి మంచు మనోజ్ రిక్వెస్ట్

Manchu Manoj: మంచు ఫ్యామిలీలో ఈ మధ్య జరుగుతున్న గొడవలు తారా స్థాయికి చేరాయి. ఎప్పుడు కామ్‌గా ఉంటారో, ఎప్పుడు గొడవలు పడుతుంటారో, ఎందుకు పడుతుంటారో తెలియనంతగా మంచు ఫ్యామిలీ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. ముఖ్యంగా మంచు మనోజ్‌ని దూరం పెడుతూ, మోహన్ బాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటుండటం, దానికి మంచు విష్ణు సపోర్ట్ అందిస్తుండటంతో.. మనోజ్ వర్సెస్ మోహన్ బాబు అండ్ విష్ణు అన్నట్లుగా నిరంతరం ఏదో ఒక రూపంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవలకి కారణం ఆస్తి తగాదాలే అని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే, ఇటీవల మోహన్ బాబు తన ఇంటిని, తన దగ్గర నుండి లాక్కున్న ఆస్తిని తనకి ఇప్పించాలని సీనియర్ సిటిజన్ కార్డ్ వాడి మరీ పోలీసులను రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడేమో.. మాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ సమస్య అంటున్నారు మంచు మనోజ్. మ్యాటర్ ఏంటంటే..

తనపై కేసులు ఎన్ని ఉన్నా, మంచు మనోజ్ పబ్లిక్‌లో మాట్లాడకుండా ఉండటం లేదు. తన అన్న, తండ్రిని టార్గెట్ చేస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా మోహన్ బాబుకు చెందిన విద్యాసంస్థల సమీపంలోని ఒక రెస్టారెంట్‌పై దాడి జరగగా, ఈ దాడి ఘటనపై మంచు మనోజ్ మీడియా సమావేశం నిర్వహించి మరోసారి మంచు విష్ణు టార్గెట్‌గా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..

Also Read- Samantha: ఎట్టకేలకు విడాకులకు కారణం చెప్పిన సమంత!

‘‘నాకు అసలు అర్థం కావడం లేదు.. ఎక్కడ గొడవ జరిగితే అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లు మాయం చేస్తున్నారు. గతంలో నేను బౌన్సర్ల సమస్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆ సమస్య తీరింది. మళ్లీ గురువారం బౌన్సర్ల విరుచుకుపడినట్లుగా నాకు కాల్స్ వచ్చాయి. బౌన్సర్ల భయపెడుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలియనీయకుండా సీసీటీవీ ఫుటేజ్‌లని మాయం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నా ఇంట్లో, ఇంక బయట ఏం జరిగినా సీసీటీవీ ఫుటేజ్‌లు మాయం చేస్తుండటం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అందుకే ఇక్కడి స్థానిక ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేస్తున్నా.. మీ ప్రజలకు మీరు ధైర్యం ఇవ్వండి.

ఎంతో మందికి సాయం చేయడం కోసమే మా నాన్న ఈ విద్యా సంస్థల్ని స్థాపించారు. అప్పుడు బాగానే ఉంది. కానీ కొన్నాళ్లుగా, అదే మేనేజ్‌మెంట్ మారినప్పటి నుండి, బౌన్సర్లను పెట్టి మరీ భయపెడుతున్నారు. వారి భయంతో రెస్టారెంట్ ఓనర్ కూడా పారిపోయాడు. ఎంత భయపెడితే అతను పారిపోయి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జరుగుతున్న విషయాలపై విద్యార్థులు కొందరు నాకు మెయిల్స్, మెసేజ్‌లు చేస్తున్నారు. నేను ఇదేంటని ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత నుండే నాపై లేనిపోని అభాండాలు వేస్తూ.. టార్గెట్ చేస్తున్నారు. ఫ్యామిలీకి దూరం చేస్తున్నారు. ఇంటిలోని మహిళలను కూడా వారు వదలడం లేదు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వారిని ఏదైనా ఒక్క ఆధారమైన చూపించమనండి. మళ్లీ చెబుతున్నాను.. జరుగుతున్నవి కుటుంబ గొడవలు కాదు.. ఆస్తి గొడవలు అంతకంటే కాదు.. ఇదంతా ఆత్మగౌరవానికి సంబంధించినవే’’ అని మంచు మనోజ్ తన వాయిస్ వినిపించారు.

ఇవి కూడా చదవండి: 

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘వాలెంటైన్స్ డే’ సర్‌‌ఫ్రైజ్‌ చూశారా..

Janhvi Kapoor X Pa. Ranjith: శభాష్.. బోల్డ్ స్టెప్ వేసిన జాన్వీ

Just In

01

CM Revanth Reddy: మోడీ, అమిత్ షా ది గోల్వాల్కర్ భావాలు: సీఎం రేవంత్ రెడ్డి

TG Christmas Celebrations: క్రిస్మస్ వేడుకలకు సర్కారు నిధులు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

Akhanda2: బాలయ్య ‘అఖండ 2’ మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?.. ఇది మామూలుగా లేదుగా..

Sircilla Panchayat Elections: రెండో దశ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ముందంజ.. దరిదాపుల్లో కూడా లేని బీజేపీ!

Panchayat Elections: రాష్ట్రంలో ముగిసిన రెండో విడత పోలింగ్.. అత్యధిక శాతం పోలింగ్ నమోదైన జిల్లా ఇదే..!