Raa Raja: ‘అర్థమైందా రాజా’ అంటే తెలుసుకానీ, ఈ ‘రా రాజా’ ఏంటి? అనుకుంటున్నారా? ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానీ, ఎవ్వరూ టచ్ కూడా చేయని ఓ ప్రయోగాత్మక చిత్రం ‘రా రాజా’. టైటిల్‌తోనే భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వాలెంటైన్స్ డే (Valentines Day)ని పురస్కరించుకుని ఈ సినిమా నుండి ఓ స్పెషల్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read- Samantha: ఎట్టకేలకు విడాకులకు కారణం చెప్పిన సమంత!
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ వైవిధ్యభరితంగా ఉండటమే కాకుండా, రోమాలు నిక్కబొడుచుకునేలా, వెన్నులో వణుకు పుట్టించేలా కట్ చేసిన తీరు ప్రశంసలను అందుకుంది. అసలు ఒక్కటంటే ఒక్క ఫేస్ కూడా కనిపించకుండా వచ్చిన ఈ ట్రైలర్ అద్భుతం అనేలా అందరినీ మెప్పించి, సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పుడు వాలెంటైన్స్ డే స్పెషల్‌గా వదిలిన పోస్టర్ కూడా వావ్ అనేలా ఉండటమే కాకుండా.. భయపెట్టేస్తుంది. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌తో వస్తేనే.. ప్రేక్షకులు ఆదరిస్తున్న రోజులివి. చూస్తుంటే ఈ సినిమాతో మేకర్స్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ పోస్టర్ సినిమాపై మరింతగా క్యూరియాసిటీని పెంచుతోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. శేఖర్ చంద్ర సంగీతం, రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి శివ ప్రసాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు.

ఇవి కూడా చదవండి: