Arjun Reddy: సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ.. ఈ ఇద్దరి పేర్లు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన ప్రభంజనం గుర్తొస్తుంది. తాజాగా సందీప్ రెడ్డి వంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఆ ఫోటో వెనుక ఉన్న అసలు కథ, ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చలు ఎంటంటే?
Read also-Chinmayi Sripada: చిన్మయి గురించి నిర్మాత చెప్పింది వింటే.. ఏడ్చేస్తారు భయ్యా..
వైరల్ అవుతున్న ఆ ఫోటో
సందీప్ రెడ్డి వంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఒక బిహైండ్ ది సీన్స్ (BTS) ఫోటోను షేర్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ తన సిగ్నేచర్ అర్జున్ రెడ్డి లుక్‌లో కూర్చొని ఉండగా, సందీప్ ఆయనకు సీన్ వివరిస్తూ కనిపిస్తున్నారు. ఎటువంటి క్యాప్షన్ లేకుండా కేవలం ఆ ఫోటోను మాత్రమే పోస్ట్ చేయడంతో అభిమానుల్లో రకరకాల సందేహాలు మొదలయ్యాయి. సాధారణంగా దర్శకులు తమ పాత సినిమాల ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేయడం సహజమే. కానీ సందీప్ షేర్ చేయడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read also-Sudev Nair: విలన్‌గా బెస్ట్ ఛాయిస్‌గా మారిన మలయాళ నటుడు.. టాలీవుడ్‌లోనూ బిజీ!
మరో ప్రాజెక్ట్ సంకేతమా?
వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందా అన్నది ప్రధాన చర్చ. ఇప్పటికే సందీప్ వంగా చేతిలో ప్రభాస్‌తో ‘స్పిరిట్’, రణబీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి పూర్తయిన తర్వాత విజయ్‌తో సినిమా చేసే అవకాశం ఉందేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరీర్ పరంగా కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో తన కెరీర్‌ను మలుపు తిప్పిన దర్శకుడు ఆయన ఫోటోను షేర్ చేయడం, విజయ్ ‘క్యాపబిలిటీ’ని ప్రపంచానికి గుర్తు చేయడమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో సందీప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అర్జున్ రెడ్డికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని, అది విజయ్ వయసు పెరిగిన తర్వాత (ముసలితనంలో) ఉంటుందని సరదాగా చెప్పారు. బహుశా ఆ దిశగా ఏమైనా ఆలోచనలు మొదలయ్యాయా అన్నది సస్పెన్స్.

