Casting Couch: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) మూవీ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో దూసుకెళుతోంది. ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ఏర్పాటు చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) గురించి సంచలన విషయాలు మాట్లాడారు. ఈ మాటలతో ఆయనపై ట్రోలింగ్ నడుస్తోంది. చిన్మయి వంటి వారు ఆయనను డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. మీ టైమ్‌లో ఎలా ఉందో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం ‘కమిట్‌మెంట్’ పేరుతో శరీరాలను కోరుకుంటున్నారు. మీరు మాట్లాడింది రాంగ్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ఈ ట్రోలింగ్‌పై ఫైర్ అవుతూ.. గతంలో స్టార్ హీరోయిన్, దివంగత నటి సౌందర్య (Soundarya) ఇండస్ట్రీ గురించి చెబుతున్న వీడియోను వైరల్ చేస్తున్నారు.
Also Read- Aishwarya Rajesh: అలాంటి బట్టలేసుకుని కనిపించమన్నాడు.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్!
మీరు ఏది ఎన్నుకుంటారో అదే మీది
గతంలో సౌందర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘సినిమాల్లోకి రండి. ఇది మంచి ఇండస్ట్రీనే. ధైర్యంగా సినిమాల్లోకి రావచ్చు. ఇప్పుడు, ఇక్కడ ఉన్నవారంతా మంచి వారే. అందరికీ మంచి ఫ్యామిలీలు ఉన్నాయి. ఇండస్ట్రీకి వస్తే చెడిపోతారనే మాటలను నమ్మకండి. ఇదొక వృత్తిగా మారిపోతుంది. మీరు ప్రొఫెషనల్‌గా ఉంటే.. ఇక్కడ ఏం జరగవు.. అంతా మంచే జరుగుతుంది. నాకు ఇక్కడ ఎటువంటి బ్యాడ్ ఎక్స్‌పీరియెన్సెస్ లేవు. అంతా మీ బిహేవియర్ మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా బిహేవ్ చేస్తారో.. మీ కెరీర్‌ను మీరు ఎంత చక్కగా బిల్డ్ చేసుకుంటారనేది ఇక్కడ ముఖ్యం. ఏ వృత్తిలో ఉన్నా.. సినిమా, డాక్టర్, ఐటీ.. ఇలా ఏదైనా సరే.. ఎక్కడైనా హెరాస్‌మెంట్స్ ఉన్నాయి కానీ, మీరు మీ లైఫ్‌ని ఎలా ఫ్రేమ్ చేసుకుంటారనేదే ముఖ్యం. మీరు ఏది ఎన్నుకుంటారో అదే మీది. నేను అంతే చెప్పగలను..’’ అని తెలిపారు. ఇప్పుడా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రీసెంట్‌గా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ సక్సెస్ మీట్‌లో చిరంజీవి కూడా ఇదే కదా చెప్పింది.. అని మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
Also Read- Nari Nari Naduma Murari OTT: ‘నారీ నారీ నడుమ మురారి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ఇండస్ట్రీ అనేది అద్దం వంటిది
అసలు చిరంజీవి ఏమన్నారంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక గొప్ప ఇండస్ట్రీ. మీకుండే అభద్రతా భావంతోటి.. ఏమో అలా ఇలా ఉండాలేమో? అని అనుకోవద్దు. మీరు ప్రొఫెషనల్‌గా ఉంటే, అవతలి వాళ్లు కూడా అలాగే ఉంటారు. మాకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదరయ్యాయని మీరంటే.. అది మీ తప్పిదమే అవుతుందని ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. మీ బిహేవియర్ ప్రకారమే ఇక్కడ అంతా జరుగుతుంది. నువ్వు స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా ఉంటే కనుక ఏ ఒక్కడూ ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకోవడానికి సాహసించరు. ఈ ఇండస్ట్రీ అనేది అద్దం వంటిది. నువ్వు ఏమి ఇస్తావో.. నీకు తిరిగి అదే వస్తుంది’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. దాదాపు చిరు, సౌందర్యల వెర్షన్ ఈ వీడియోలో ఒకేలా ఉండటం విశేషం. అందుకే ఈ వీడియోను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
Megastar Chiranjeevi and Soundarya garu stood for professionalism, not shortcuts.#CastingCouch pic.twitter.com/xromLvm7su
— Gowtham (@GowthamCinemas) January 30, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

