Nari Nari Naduma Murari OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Sharwanand caught between two women in a humorous scene from the film Nari Nari Naduma Murari.
ఎంటర్‌టైన్‌మెంట్

Nari Nari Naduma Murari OTT: ‘నారీ నారీ నడుమ మురారి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Nari Nari Naduma Murari OTT: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) హీరోగా వచ్చిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari). రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో వచ్చి, ఈ సంక్రాంతికి డీసెంట్ హిట్‌ను సొంతం చేసుకుంది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. శర్వానంద్ సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ సంక్రాంతి బరిలో చివరిగా విడుదలైన ఈ చిత్రం, సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలకంటే బాగుందనేలా టాక్‌ని సొంతం చేసుకుంది. కానీ, సంక్రాంతికి రావడమే పెద్ద మైనస్ అయింది.. లేదంటే ఈ సినిమా భారీగా కలెక్షన్స్‌ను రాబట్టేది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Also Read- Aishwarya Rajesh: అలాంటి బట్టలేసుకుని కనిపించమన్నాడు.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్!

రాంగ్ టైమ్ రిలీజ్..

సంక్రాంతి బరిలో కాకుండా సోలోగా ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఉంటే ఇంత తొందరగా ఓటీటీకి వచ్చేది కాదు. ఎందుకంటే, ఇందులో ఉన్న కంటెంట్ ప్రేక్షకులను అంతగా మెప్పించింది. కానీ, ఎక్కువ పోటీలో విడుదల కావడంతో పాటు, చివరిగా విడుదలవడంతో.. టాక్‌‌కు సరిపడా కలెక్షన్స్ రాబట్టలేదు. అలా అని, ఈ సినిమా ఏం యావరేజ్ కాలేదు. కలెక్షన్స్ పరంగానూ పెద్ద హిట్టే అయింది. ముందుగా సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలలో బ్రేకీవెన్ సాధించిన చిత్రమిదే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరిగ్గా థియేటర్లు లభించలేదు కానీ, లేదంటే నిర్మాతలకు పంట పండేది. సరే.. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడీ సినిమా విడుదలైన 20 రోజులు కూడా కాకుండానే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సంస్థ.. స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించింది.

Also Read- Sudev Nair: విలన్‌గా బెస్ట్ ఛాయిస్‌గా మారిన మలయాళ నటుడు.. టాలీవుడ్‌లోనూ బిజీ!

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అందుతున్న వివరాల ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో సూపర్ హిట్టయిన ఈ సినిమా, ఓటీటీలోనూ అద్భుతమైన ఆదరణు రాబట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. నిజంగా అది నిజం కూడా. ఎందుకంటే, సరిగ్గా థియేటర్లు లభించక ఈ సినిమాను చాలా మంది స్కిప్ కొట్టారు. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు ఎగబడే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రైమ్ వీడియోకు పంట పండినట్టే. ఇందులో మరో యంగ్ హీరో శ్రీ విష్ణు గెస్ట్ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. శర్వానంద్‌కు కూడా ఈ సినిమా చాలా ప్లస్ అయింది. ఎందుకంటే, శర్వాకు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ బాధను తీర్చేసి, మళ్లీ సక్సెస్ బాటలోకి శర్వాను ఈ సినిమా నడిపించింది. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మూడు సినిమాలున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?