Sudev Nair: విలన్‌గా బెస్ట్ ఛాయిస్‌గా మారిన మలయాళ నటుడు..
Sudev Nair in an intense villain role, holding a gun in a dramatic Telugu movie scene.
ఎంటర్‌టైన్‌మెంట్

Sudev Nair: విలన్‌గా బెస్ట్ ఛాయిస్‌గా మారిన మలయాళ నటుడు.. టాలీవుడ్‌లోనూ బిజీ!

Sudev Nair: ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రతి చిత్రంలోనూ ఓ నటుడు కనిపిస్తున్నారు. ఆ నటుడు ఎవరో కాదు సుదేవ్ నాయర్ (Sudev Nair). మలయాళ నటుడు అయినప్పటికీ, తన విలక్షణమైన నటనతో అన్ని ఇండస్ట్రీలలోనూ అవకాశాలను పట్టేస్తున్న సుదేవ్ నాయర్.. ఇటీవల వచ్చిన ‘ఓజీ’ (OG Movie) చిత్రంతోనూ, ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రంతోనూ మంచి గుర్తింపును పొందారు. తెరపై ఆయన పోషిస్తున్న పాత్రలు, చూపిస్తున్న విలనిజం, బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆయన పని తీరు అందరినీ మెప్పిస్తూ బిజీ నటుడిని చేస్తోంది. ఆయన కనిపిస్తున్న ప్రతీ సినిమా రీసెంట్‌గా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తుండటంతో సుదేవ్ నాయర్ కోసం ప్రత్యేకంగా పాత్రలు రాస్తుండటం విశేషం. గత ఏడాది వచ్చిన ‘ఓజీ’ చిత్రంలో సుదేవ్ నాయర్ పాత్రకు, ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కిన సంగతి తెలియంది కాదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో సుదేవ్ నాయర్ మరోసారి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

Also Read- Prabhas: మారుతి‌కి మరో ఛాన్స్.. అందుకే ప్రభాస్ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్!

విమర్శకుల ప్రశంసలు పొందుతూ..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమా అంటే అంతా చిరంజీవే ఉంటారు. ఇతర నటీనటులకు అంతగా గుర్తింపు రాదు. అలాంటిది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో సుదేవ్ నాయర్ పాత్ర, నటించిన తీరు గురించి తెలుగు ఆడియెన్స్‌ను ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాయర్ చాలా క్లిష్టమైన పాత్రని, డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రని పోషించారు. సుదేవ్ నాయర్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఈ సక్సెస్‌తో ఆయన మరిన్ని ఛాన్స్ పలకరిస్తున్నాయట. అందుకనే తన సంతోషాన్ని తెలియజేస్తూ.. ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే మరిన్ని విభిన్న పాత్రలలో కనిపించి ప్రేక్షకులను అలరిస్తానని చెబుతున్నారు.

Also Read- Bhagavanthudu: తిరువీర్ ‘భగవంతుడు’ టీజర్ వదిలారు.. పక్కా హిట్టంట!

ఫస్ట్ ఛాయిస్‌గా..

జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న సుదేవ్ నాయర్ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ.. నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పాత్రలకు తగినట్లుగా కండలు తిరిగిన దేహంతో, అథ్లెటిక్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే సుదేవ్ తెలుగు మాస్ ఆడియెన్స్‌కి బాగా దగ్గరవుతున్నారు. ఇదే జోష్‌లో తనని ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం ఇంకాస్త కష్టపడేందుకు సిద్ధమవుతున్నారు. అవును, త్వరలోనే తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేందుకు సుదేవ్ సిద్ధమవుతున్నారు. ఇది తెలుగు ప్రేక్షకులన్నా, తెలుగు సినిమాలన్నా ఆయన ఎంత అభిమానమో తెలియజేస్తుంది. మరి ఆయన తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పే సినిమా ఏదవుతుందో చూడాలి. ప్రస్తుతం ‘కెజియఫ్’ స్టార్ యష్‌ ‘టాక్సిక్ – ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్‌’లో ఓ ప్రధాన పాత్రను నాయర్‌ పోషిస్తున్నారు. ఈ మూవీ మార్చిలో ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత సుదేవ్ నాయర్ పేరు నేషనల్ వైడ్‌గా వినిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ రాజ్, జగ్గూ భాయ్ వంటి వారు పోషించే పాత్రలకు.. మున్ముందు సుదేవ్ నాయర్ ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తాడనేలా.. అప్పుడే టాక్ కూడా మొదలైంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?