Bhagavanthudu: ‘ది ప్రీ వెడ్డింగ్ షో’ (The Pre Wedding Show) సినిమా తర్వాత యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ (Thiruveer) నటిస్తున్న నూతన చిత్రం ‘భగవంతుడు’ (Bhagavanthudu). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రొడ్యూసర్ రవి పనస నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర టీజర్‌ను హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.
Also Read- Vijay Devarakonda: ‘ఆర్’ లెటర్ సినిమాలతో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్‌పై డబుల్ అటాక్!
అంత బడ్జెట్ పెడతారా?
టీజర్ లాంఛ్ కార్యక్రమంలో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. ‘ది ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా తర్వాత అందరినీ ఇలా కలిసినందుకు హ్యాపీగా ఉంది. ఒకరోజు వేణు ఊడుగుల కాల్ చేసి మంచి స్టోరీ ఉంది విను అని పంపారు. ఆ కథ విన్న 5 నిమిషాలకే చాలా గొప్ప మూవీ అవుతుందని అర్థమైంది. నాకు ఇక స్క్రిప్ట్ చెప్పవద్దు.. షూటింగ్ ఎప్పుడో చెప్పండని అన్నాను. అప్పటికి ‘మసూద’ రిలీజైంది. ఆ మూవీ హిట్ అయినా తిరువీర్ మీద ఎంత పెట్టొచ్చు, ఎంత వస్తుందని అంతా మాట్లాడుకుంటున్నారు. ‘భగవంతుడు’ కథకు చాలా బడ్జెట్ అవుతుంది.. నా మీద అంత బడ్జెట్ పెడతారా అనే సందేహం ఉండేది. నటుడిగా నువ్వు ఈ కథకు కావాలని చూస్తున్నామని వేణు అన్న, డైరెక్టర్ గోపి విహారి నాతో చెప్పారు. నాకు డ్యాన్స్ రాదు.. గోవింద్ డ్యాన్స్ నేర్పించారు. అలాగే మహేశ్ మాస్టర్ డప్పు కొట్టడం నేర్పారు. ఈ సినిమాలో మేమంతా ఒకరితో ఒకరం పోటీ పడి నటించాం. నన్ను నమ్మండి.. ఈ సినిమా చాలా గొప్ప సినిమా అవుతుంది.. అందరినీ అలరిస్తుందని అన్నారు.
Also Read- Varanasi: అఫీషియల్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ చెప్పేసిన సూపర్ స్టార్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
టీజర్ ఇంత బాగుంటుందని అనుకోలేదు
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నేను ‘స్నేహగీతం’ సినిమా చేస్తున్న టైమ్ నుంచి రవి పనస నాకు మంచి మిత్రుడు. ప్రతి విషయంలో సపోర్ట్‌గా ఉండేవారు. ఆయన ఈ సినిమా నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఏషియన్ సునీల్‌తో కలిసి పక్కా ప్లానింగ్‌తో రవి పనస ఈ మూవీ నిర్మిస్తున్నారు. టీజర్ చాలా బాగుంది. ఇంత బాగుంటుందని ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. తిరువీర్ నటనను బాగా ఇష్టపడతాను. ఆయన మసూద సినిమాను చాలా చూశా. ఫరియా నాతో ‘సిగ్మా’ అనే మూవీలో నటిస్తోంది. ఆమె మంచి కోస్టార్. డైరెక్టర్ విహారి గారికి కంగ్రాట్స్. ‘భగవంతుడు’ సినిమా ఘన విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని చెప్పుకొచ్చారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి రాకముందు ప్రతి ప్రమోషన్ ఈవెంట్‌లో హీరోల పక్కన రవి పనస అన్న కనిపించేవారు. సినిమా అవకాశాల కోసం ఫిలింనగర్ వచ్చి ఆయనను కలిసివాడిని. ఆయన ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు రావాలని అనగానే తప్పకుండా వస్తానని చెప్పాను. అలాగే తిరువీర్ నాకు మంచి మిత్రుడు. వాస్తవానికి ‘ఫలక్ నుమా దాస్’ సినిమాలో తిరువీర్ నటించాలి.. కానీ కుదరలేదు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

