Nirmala Seetharaman | తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాజాగా పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. మొన్న బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. ‘తెలంగాణ రాష్ట్రం విభజనకు ముందు మిగులు బడ్జెట్ తో ఉండేది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాతనే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది. దానికి కేంద్రానికి సంబంధం లేదు. తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు’ అంటూ ఆమె తెలిపారు.
చాలా సార్లు కేంద్రమే తెలంగాణకు అడిగిన దానికన్నా నిధులు ఎక్కువగా కేటాయించినట్టు ఆమె వివరించారు. అయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్ గురించి సమాధానం ఇవ్వట్లేదని కాంగ్రెస్ ఎంపీలు అసంతృప్తి తెలిపారు. 2025 బడ్జెట్ లో ఏపీకి, బీహార్ కు భారీగా నిధులు కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం పెద్దగా నిధులు కేటాయించలేదు. గతంలో కూడా ఇలాగే జరిగిందని కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు.