Illegal Steroid Sale: మృత్యు ముఖానికి చేరుతున్న యువకులు
Illegal Steroid Sale (imagecredit:twitter)
Telangana News

Illegal Steroid Sale: సిక్స్ ప్యాక్ కోసం స్టెరాయిడ్లు.. మృత్యు ముఖానికి చేరుతున్న యువకులు

Illegal Steroid Sale: జిమ్​ లకు వెళ్లే యువకులే వారి టార్గెట్. సిక్స్​ ప్యాక్ బాడీ కావాలా? అదీ నాలుగైదు నెలల్లోనే అంటూ వారిని స్టెరాయిడ్​ ఇంజక్షన్లకు అలవాటు చేస్తున్నారు. తమ సంపాదన కోసం అవతలి వారి ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారు. క్రమంగా వారిని మృత్యుముఖంలోకి నెడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే కొంతమంది జిమ్ నిర్వాహకులు ట్రైనర్లు స్టెరాయిడ్​ ఇంజక్షన్ల దందా చేస్తుండటం. హాలీవుడ్​ నుంచి టాలీవుడ్​ వరకు పలువురు హీరోలు సిక్స్​ ప్యాక్​ బాడీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు కూడా జిమ్​‌లకు వెళుతూ సిక్స్​ ప్యాక్ సాధించి తామూ ఏమీ తక్కువ తినలేదని నిరూపిస్తున్నారు. వీరి ప్రభావం యువతపై పడుతుందనటంలో సందేహం లేదు. దానికితోడు ఫిట్ నెస్ పై యువతీ, యువకుల్లో కొంతకాలంగా అవేర్ నెస్ గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో వేలాది మంది క్రమం తప్పకుండా జిమ్‌లకు వెళుతున్నారు. దాంతో ఏ జిమ్​ చూసినా ఉదయం సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసే యువతీ, యువకులతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది. సరిగ్గా ఈ పరిస్థితిని కొంతమంది అక్రమ సంపాదనలకు అవకాశంగా చేసుకుంటున్నారు. జిమ్​‌లకు వచ్చే వారిలో ముఖ్యంగా యువకులతో మాట కలిపి ఏడాది.. రెండేళ్లు కష్టపడితేగాని రాని సిక్స్​ ప్యాక్​ అయిదారు నెలల్లో కావాలనుకుంటున్నారా? అయితే, మేం చెప్పినట్టు చేయండి అంటూ స్టెరాయిడ్​ ఇంజక్షన్లు అమ్ముతున్నారు. ప్రొటీన్​ పౌడర్లు అలవాటు చేస్తున్నారు.

ఢిల్లీ.. సూరత్‌ల నుంచి..

స్టెరాయిడ్​ ఇంజక్షన్లు దందా చేస్తున్న వారిలో అధికశాతం మంది మెఫెంటర్మయిన్​ సల్ఫేట్ ఇంజక్షన్లను విక్రయిస్తున్నారు. ఈ ఇంజక్షన్​ ధర 25‌‌0 రూపాయల వరకు ఉంది. నిబంధనల ప్రకారం మెడికల్ ప్రిస్క్రిప్షన్​ లేనిదే ఈ ఇంజక్షన్లను అమ్మటానికి వీల్లేదు. అయితే, ఈ ఇంజక్షన్ల విక్రయాలు చేస్తున్న వారు ఢిల్లీ, సూరత్‌ల నుంచి వాటిని తీసుకొస్తున్నారు. కొందరు స్వయంగా వెళ్లి తీసుకొస్తుంటే మరికొందరు కొరియర్ల ద్వారా భారీ మొత్తంలో స్టెరాయిడ్ ఇంజక్షన్లు తెప్పించుకుంటున్నారు. ఒక్కో ఇంజక్షన్​ ను 400 నుంచి 500 రూపాయలకు అమ్ముతున్నారు. దీనికి నిదర్శనంగా సూరత్ నుంచి మెఫంటర్మయిన్​ ఇంజక్షన్లు తెచ్చి అమ్ముతూ వెస్ట్​ జోన్​ టాస్క్​ ఫోర్స్ పోలీసులకు మహ్మద్ ఫైజల్ ఖాన్​ ఉదంతాన్ని పేర్కొనవచ్చు. సూరత్ నుంచి ఈ ఇంజక్షన్లను కొని తెచ్చిన ఫైజల్ ఖాన్​ అత్తాపూర్ లో వాటిని విక్రయిస్తుండగా సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అరెస్ట్​ చేశారు.

Also Read: Komalee Prasad: కోలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ భామ.. ఏ సినిమాతో అంటే?

హకీంపేటలో నివాసముంటూ..

అతని నుంచి 133 ఇంజక్షన్లను సీజ్​ చేశారు. ఇక, డబ్బు సంపాదనే లక్ష్యంగా హైదరాబాద్(Hyderabad)లోని కొందరు మెడికల్ హాళ్ల యజమానులు కూడా ఈ ఇంజక్షన్లను యధేచ్ఛగా విక్రయిస్తున్నారు. గతంలో సౌత్ వెస్ట్​ జోన్​ టాస్క్​ ఫోర్స్ పోలీసులు ఇలా స్టెరాయిడ్ ఇంజక్షన్లు అమ్ముతున్న మెడికల్ స్టోర్ల​ యజమానులు సంజీవ్​, మహ్మద్​ నజీర్​ లను అరెస్ట్ చేశారు. ఆందోళనాకరమైన అంశం ఏమిటంటే కొందరు జిమ్ యజమానులు, ట్రైనర్లు ఈ దందా చేస్తుండటం. హకీంపేటలో నివాసముంటూ జిమ్ ట్రైనర్​‌గా పని చేస్తున్న ఇమ్రాన్ ఖాన్​ అనే వ్యక్తి ఇలాగే స్టెరాయిడ్​ ఇంజక్షన్లు అమ్ముతుండగా సౌత్ వెస్ట్ జోన్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా సౌత్ జోన్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అబ్దుల్ గఫార్​ ఖాన్​ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్​ టాస్క్ ఫోర్స్​ పోలీసులు రషీద్ మత్లూబ్​ ఖాన్​ అనే జిమ్ ట్రైనర్ను అరెస్ట్​ చేసి లక్షా 20వేల రూపాయల విలువ చేసే మెఫంటర్మయిన్​ సల్ఫేట్ ఇంజక్షన్లను సీజ్ చేశారు.

ప్రాణాలకే ప్రమాదం..

కండల కోసం స్టెరాయిడ్​ ఇంజక్షన్లు తీసుకోవటం వల్ల ప్రాణాలకు ప్రమాదమని కార్డియాలజిస్ట్ డాక్టర్​ శశికాంత్ చెప్పారు. ఈ ఇంజక్షన్లు తీసుకోవటం వల్ల నాళాల్లో రక్తప్రసరణ పెరిగి గుండె మామూలుకన్నా ఎక్కువ వేగంతో కొట్టుకుంటుందని తెలిపారు. దీనివల్ల వెంట్రిక్యులర్​ ఫిబ్రిలేషన్, వెంట్రిక్యులర్​ టెకీ కార్డియాకు గురవుతారన్నారు. ఆకస్మికంగా గుండె ఆగిపోయి చనిపోతారని చెప్పారు. జిమ్​లలో కసరత్తులు చేస్తూ యువకులు చనిపోతుండటానికి ఇదో కారణమన్నారు. సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్​ విజయ్ కుమార్​‌తో మాట్లాడగా స్టెరాయిడ్ ఇంజక్షన్ల వల్ల గుండె, కిడ్నీలు దెబ్బ తింటాయన్నారు. దాంతోపాటు లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పారు. స్టెరాయిడ్​ ఇంజక్షన్లు తీసుకోవటం వల్ల కండరాలు వేగంగా పెరుగుతాయని చెబుతూ ఇది కేవలం వాపు మాత్రమే అన్నారు. ఇంజక్షన్లు తీసుకోవటం ఆపేసినా, వ్యాయామం మానేసినా అంతే వేగంగా కండరాలు కనుమరుగై ఆ ప్రాంతంలో శరీరం వదులుగా మారుతుందని వివరించారు. అందువల్ల స్టెరాయిడ్​ ఇంజక్షన్లు, ప్రొటీన్​ పౌడర్లకు దూరంగా ఉండటమే మంచిదన్నారు. ఓ ప్లాన్​ ప్రకారం ఎక్సర్ సైజులు చేస్తే కాస్త ఆలస్యమైనా సిక్స్​ ప్యాక్​ సాధించుకోవచ్చన్నారు.

Also Read: MLA Kaushik Reddy: సమ్మక్క జాతరలో ఓవరాక్షన్.. పాడి కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ సంఘం సీరియస్

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?