Komalee Prasad: కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ భామ కోమలి ప్రసాద్. ఆమె ‘మండవెట్టి’ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది పవర్ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఆమె సినీ కెరీర్లో ఇదొక ముఖ్యమైన, కొత్త చాప్టర్. ఈ సందర్భంగా తనకు ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు కావాలని కోరుతూ కోమలి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ‘మండవెట్టి’ సినిమాను ప్రారంభించటం తమకెంతో గర్వంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. టస్కర్స్ డెన్ పిక్చర్స్ బ్యానర్‌పై శరణ్ రాజ్ సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న మండవెట్టి మూవీ టీమ్ లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసి షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది.
Read also-The Raja Saab OTT: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘మండవెట్టి’తో కోమలి ప్రసాద్ తన సినీ కెరీర్లో కొత్త భాష, కొత్త సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో పాటు మిస్టిసిజం, ఎమోషన్స్ కలయికగా ఓ మహిళ ప్రధానమైన కథతో సినిమా తెరకెక్కుతోంది. మనకు కావాల్సిన దాన్ని కోల్పోవటం కలిగే బాధ, గుర్తింపు, జీవన పోరాటం, వంటి అంశాలను మిళితం చేసి పెర్ఫామన్స్‌కు స్కోప్ ఉన్న కథను రూపొందించారు . పెర్ఫామెన్స్‌తో పాటు భావోద్వేగానికి ప్రాధాన్యమున్న ఈ కథంతా కోమలి ప్రసాద్ ప్రధానంగా సాగుతుంది. ‘వెల్ల కుదిర’వంటి సెన్సిబుల్, సైకలాజికల్ మూవీని రూపొందించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ శరణ్‌రాజ్ సెంథిల్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా, భావోద్వేగాలు ప్రధానంగా మండవెట్టి సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఆయన ఎమోషన్స్, పాత్రల అంతర్గతభావాలపై పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ సినిమాలో ఇంకా తేనప్పన్, గజరాజ్, అమృత సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. వీరి నటన కథలోని ఎమోషన్స్‌కు మరింత బాలన్ని తీసుకురానున్నాయి. సాంకేతికంగా చూస్తే.. సినిమాటోగ్రాఫర్ ప్రకాశ్, ఎడిటర్ కునా, సంగీత దర్శకుడు దీపక్ వేణుగోపాల్, స్టంట్ కొరియోగ్రాఫర్ గౌతమ్ వర్క్ చేస్తున్నారు. స్పష్టమైన ఆలోచనతో బెస్ట్ మూవీని రూపొందించటానికి టీమ్ పని చేస్తోంది. కోమలీ ప్రసాద్ కెరీర్లో ఈ తమిళ సినిమా ఒక కీలకమైన అడుగు. ప్రారంభం నుంచే ప్రేక్షకులను మెప్పించేలా భావోద్వేగాలు ఉన్న పాత్రలకే ఆమె ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇప్పటివరకు ఆమె తెలుగు ఆడియెన్స్‌ను నెపోలియన్, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ P.C. 524, హిట్ – సెకండ్ కేస్, హిట్ – థర్డ్ కేస్, శశివదనే చితాలతో ఆకట్టుకుందది. అలాగే డిజిటల్ మాధ్యమాల్లోనూ లూజర్ (ZEE5), మోడర్న్ లవ్ హైదరాబాద్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), టచ్ మీ నాట్ (జియో హాట్‌స్టార్) లాంటి సిరీస్‌ల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది.
Read also-Varun Dhawan: ‘బోర్డర్ 2’ సెట్స్‌లో వెన్నెముక విరగ్గొట్టుకున్న హీరో.. షాకింగ్ వీడియో వైరల్!
మాధ్యమం ఏదైనా కోమలి ప్రసాద్ నటన గ్లామర్‌తో పాటు నటకు స్కోప్ ఉన్న పాత్రలతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఎక్కగా ఎక్కువ చేస్తుందే అనిపించేలా కాకుండా సహజంగా కథను ముందుకు నడిపించేలా ఉండే ఆమె నటన, స్టైల్‌తో ఆమెకు మంచి పేరొచ్చింది. ‘మండవెట్టి’ మూవీ తమిళ సినిమాతో కోమలి తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టటం అనేది ఆమె కొత్త భాషలో ప్రయత్నిస్తుందనే కాదు.. తన నటనకు పరీక్ష పెట్టే బలమైన పాత్రతో ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోందని అర్థం. ఇది చూస్తుంటే ఆమె ఎలాంటి పాత్రలను ఎంచుకుంటుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమా గురించి అప్టేట్ కోసం కోమలి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

