The Raja Saab OTT: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా.. మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఫిబ్రవరి 6, 2026 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రభాస్ వింటేజ్ లుక్ కామెడీ టైమింగ్‌తో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకు చూడని ఒక కొత్త తరహా పాత్రలో ‘ది రాజాసాబ్’ చిత్రం రూపొందింది. సాధారణంగా ప్రభాస్ సినిమాలు అంటే భారీ యాక్షన్ డ్రామాలు ఉంటాయని ఆశించే అభిమానులకు, ఈసారి మారుతి ఒక హారర్ ఎలిమెంట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌ను అందించారు.
Read also-Om Shanti Shanti Shanti Review: తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఎలా ఉందంటే?.. ఫుల్ రివ్యూ

