Vijay Devarakonda: టాలీవుడ్ సెన్సేషన్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మళ్లీ తన అసలైన వింటేజ్ ఫామ్‌లోకి వచ్చేస్తున్నాడు. ఈ ఏడాది విజయ్ నుంచి ఒకటి కాదు, రెండు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. అవి ‘రణబాలి’ (Ranabaali), ‘రౌడీ జనార్థన’ (Rowdy Janardhana). ఈ రెండు ‘ఆర్’ లెటర్ సినిమాలతో 2026ని తన ఖాతాలో వేసుకోవడానికి విజయ్ దేవరకొండ శాయశక్తులా కృషి చేస్తున్నాడు. కేవలం తెలుగులోనే కాదు, నేషనల్ లెవల్లో ఈ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనేలా, ఈ సినిమాల ఫస్ట్ లుక్ టీజర్స్ తెలియజేస్తున్నాయి. వాస్తవానికి యంగ్ హీరోల రేసులో విజయ్ దేవరకొండ వెనుకబడ్డాడనే చెప్పుకోవాలి. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలతో ఒక్కసారిగా ఎక్కడా లేని క్రేజ్‌ని తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, ఆ తర్వాత చేసిన చిత్రాలతో మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన పక్కా ప్లాన్‌గా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read – Varanasi: అఫీషియల్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ చెప్పేసిన సూపర్ స్టార్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
‘ఆర్’ లెటర్ ఎంతో ప్రత్యేకం
విజయ్ దేవరకొండకు ‘ఆర్’ లెటర్ ఇప్పుడు ఎంతో ప్రత్యేకంగా మారింది. త్వరలో తను పెళ్లి చేసుకోబోతున్నాడనేలా వార్తలు వినిపిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) పేరు కూడా ‘ఆర్’ లెటర్‌తోనే మొదలవుతుంది. అలాగే ఇప్పుడాయన చేతుల్లో ఉన్న రెండు ప్రాజెక్ట్స్ కూడా ‘ఆర్’ లెటర్ (R Letter)తోనే మొదలవుతున్నాయి. అంతే, ‘ఆర్’కి అంతగా కనెక్ట్ అయ్యాడన్నమాట. మరీ ప్రేమలో గెలిచి పెళ్లి వరకు వెళుతున్న విజయ్ దేవరకొండ, సినిమాల పరంగా కూడా ఈసారి తన గెలుపుని ప్రదర్శిస్తాడని, అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. ఇక ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే..
Also Read – Sonu Sood: సోషల్ మీడియా విషయంలో.. ప్రధానికి సోనూసూద్ సంచలన విన్నపం
రణబాలి, రౌడీ జనార్థన.. రెండూ రెండే!
‘టాక్సీవాలా’ వంటి హిట్ తర్వాత రాహుల్ సంకృత్యన్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న సినిమా ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇదొక పీరియాడిక్ డ్రామా అని తాజాగా వచ్చిన టైటిల్ క్లింప్స్ క్లారిటీ ఇచ్చేసింది. రాహుల్ సంకృత్యన్ ఈ కథను చాలా ప్యాషనేట్‌గా తీర్చిదిద్దారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ చూస్తే, విజయ్ లుక్ అండ్ మేకింగ్ స్టైల్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుందని తెలుస్తోంది. ఇంక రెండో ప్రాజెక్ట్ ‘రౌడీ జనార్థన’ ఈ ఇయర్ ఎండ్‌లో రానుందని అంటున్నారు. ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. రవికిరణ్ కోలాకు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్. విజయ్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా ఒక పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని మలుస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పాన్ ఇండియా వైడ్‌గా నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతున్నాయని ఈ టీజర్ హింట్ ఇచ్చేసింది. డిసెంబర్ నెలలో ఈ సినిమా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయనుందని తెలుస్తోంది. ఇలా రెండు భిన్నమైన పాత్రల్లో విజయ్‌ని చూడటం ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. అందుకే 2026 సంవత్సరం విజయ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

