Gudivada Amarnath: కూటమి ప్రభుత్వంపై గుడివాడ వ్యంగ్యాస్త్రాలు
YSRCP leader Gudivada Amarnath addressing media and criticising the Andhra Pradesh coalition government over land titling act
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Gudivada Amarnath: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్.. ఏమన్నారంటే

Gudivada Amarnath: ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సారధ్యంలోని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడే మాజీ మంత్రి, వైసీపీ (YSRCP) సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) మరోసారి విమర్శలు గుప్పించారు. అప్పట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే రాద్ధాంతం చేశారని, ఇప్పుడు చంద్రబాబు టైట్లింగ్ యాక్ట్ వచ్చిందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకు కావాల్సిన వారికి, బంధువులకు ఎంత చెబితే అంత ప్రభుత్వ భూమిని ఇచ్చేయడమే ఈ చంద్రబాబు టైట్లింగ్ యాక్ట్ అని ఆరోపణలు చేశారు. విశాఖపట్నం లాంటి నగరంలోని ఖరీదైన భూమిని ధారాదత్తం చేసే కార్యక్రమం జరుగుతోందని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ విధంగా భూములను పంచిపెట్టడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.

‘‘ఇప్పుడు చంద్రబాబు టైట్లింగ్ యాక్ట్ వచ్చేసింది. అంటే, ఆయన ఏది, ఎవరికి ఇస్తే వారిదే. ఆయన ఎవరికి చెబితేవారికి, వారి కుటుంబ సభ్యులకు ఇస్తారు. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. భూములను ధారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిమీద అవసరమైతే పెద్ద ఎత్తున మా పార్టీ పెద్దలతో మాట్లాడి ఎంపీ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తాం. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద వారి మీద కేసు నమోదు చేయాల్సిందే. ప్రభుత్వాలు ఇప్పటికే సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కంచె చేను మేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, బాధ్యతాయుత పార్టీగా వైఎస్సార్‌‌సీపీ ఈ ప్రాంత భూములను కాపాడే బాధ్యతను తీసుకుంటుంది’’ అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Read Also- February 1 New Rules: ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే.. ఎవరిపై ప్రభావం ఉంటుందంటే?

‘గీతం’ భూములపై వైసీపీ రాద్దాంతం

టీడీపీకి చెందిన విశాఖపట్నం ఎంపీ భరత్‌కు చెందిన చెందిన గీతం (GITAM) విద్యాసంస్థల భూముల వ్యవహారం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణల పర్వం కొనసాగుతోంది. గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న కొంత ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడానికి (రిజిస్ట్రేషన్ చేయడం) ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ వైసీపీ చెబుతోంది. ఈ భూమి విలువ సుమారు వేల కోట్లు ఉంటుందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కౌన్సిల్ సమావేశంలో భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన అంశాన్ని ఎజెండాలో చేర్చడంతో ఈ వివాదం రాజుకుంది.

Read Also- Medigadda Barrage: అత్యధిక ప్రమాదకర జాబితాలో మేడిగడ్డ.. తక్షణ జోక్యం అవసరం అంటూ కేంద్రం హెచ్చరిక..!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?