Husband Suicide: కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే భార్య పరాయి వ్యక్తితో లేచిపోవడంతో భర్త తట్టుకోలేకపోయాడు. భార్యతో పాటు ఇందుకు కారణమైన వారి పేర్లను సూసైడ్ నోట్ లో రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భార్యను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు.
అసలేం జరిగిందంటే?
దావణగెరె జిల్లా గుమ్మనూరు ప్రాంతానికి చెందిన హరీశ్ (30), సరస్వతిలకు 2 నెలల క్రితం వివాహం జరిగింది. జనవరి 23న సరస్వతి గుడి వెళ్తున్నానని చెప్పి వెళ్లి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల విచారణలో సరస్వతి తన ప్రేమికుడు శివకుమార్ తో పారిపోయినట్లు తేలింది.
భార్య మోసాన్ని తట్టుకోలేక..
తన భార్య మరొక వ్యక్తితో లేచిపోయిందన్న విషయం తెలుసుకొని భర్త హరీశ్ తట్టుకోలేకపోయాడు. భార్యతో పాటు, ఆమెను తనకు ఇచ్చి పెళ్లి చేసిన వారి పేర్లను సూసైడ్ నోట్ లో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హరీశ్ మరణవార్త విని.. సరస్వతి మేనమామ రుద్రేష్ (36) సైతం సూసైడ్ చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సరస్వతిని పెళ్లి చేసుకోవాలని.. హరీశ్ ను రుద్రేష్ ఒప్పించినట్లు తెలుస్తోంది. దీంతో సూసైడ్ నోట్ లో హరీశ్.. రుద్రేశ్ పేరు రాశారని, అరెస్టు భయం తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.
ప్రేయసి లవ్ స్టోరీ తెలిసినా..
భార్య సరస్వతి.. శివకుమార్ అనే వ్యక్తిని ప్రేమించిన విషయం పెళ్లికి ముందే హరీశ్ కు తెలుసని పోలీసుల దర్యాప్తులో తేలింది. హరీశ్ తన కుటుంబ సభ్యుల్ని ఒప్పించి మరి సరస్వతిని పెళ్లి చేసుకున్నాడని తేలింది. ఈ క్రమంలో రుద్రేష్ వీరి పెళ్లికి దగ్గరుండి ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లికి ముందే ప్రియుడికి బ్రేకప్ చెప్పానని చెప్పి.. హరీశ్ ను పెళ్లి చేసుకున్న సరస్వతి.. అనూహ్యంగా అతడితో లేచిపోవడంతో భర్త తట్టుకోలేకపోయాడని బంధువులు చెబుతున్నారు.
Also Read: Medaram Jatara 2026: మేడారంలో భారీ దోపిడి.. మటన్, చికెన్, మద్యం ధరలు చూసి.. నివ్వెరపోతున్న భక్తులు!
భార్యపై కేసు నమోదు..
ఒక కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య పాల్పడటంతో దావణగెరే గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్ దళిత వర్గానికి చెందిన వాడు కావడంతో ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టారు. హరీశ్ బంధువుల ఫిర్యాదు ఆధారంగా అతడి భార్య సరస్వతిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై ఆమెను రిమాండ్ కు తరలించినట్లు దావణగెరె పోలీసులు స్పష్టం చేశారు.
Police have arrested the woman who eloped with her boyfriend just two months after marriage, leading to two deaths.
The #DavanagerePolice have taken Saraswati, wife of the deceased Harish, into custody.
Saraswati was arrested from a relative's house in #Elebethur, #Davanagere,… https://t.co/4yltCwnSYq pic.twitter.com/VjBzjnDS6P
— Hate Detector 🔍 (@HateDetectors) January 29, 2026

